వాళ్లపై అసూయ లేదు : అనసూయ | i am proud of my work and also pf my talented friends says anasuya | Sakshi
Sakshi News home page

వాళ్లపై అసూయ లేదు : అనసూయ

Published Sat, Mar 18 2017 10:56 AM | Last Updated on Thu, Jul 25 2019 6:37 PM

వాళ్లపై అసూయ లేదు : అనసూయ - Sakshi

వాళ్లపై అసూయ లేదు : అనసూయ

హైదరాబాద్ :
సాధారణంగా ఒకే వృత్తిలో కొనసాగుతున్నప్పుడు మరోకరి ఎదుగుదలను చూసి ఓర్వలేకపోతుంటారు. ముఖ్యంగా యాంకరింగ్లాంటి క్లిష్టమైన బాధ్యతల్లో కాంపిటీషన్ ఇంకా ఎక్కువ. ఎక్కడ ఒకరి అవకాశాన్ని మరొకరు ఎత్తుకుపోతారేమో అనే సందిగ్ధం ఎప్పుడూ ఉండనే ఉంటుంది. అయితే తన సహచరుల ఎదుగుదలను చూసి తనకు అసూయ ఉండదని చెబుతోంది ప్రముఖ యాంకర్ అనసూయ. బుల్లితెరపై తమకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని చాటుకున్న రెష్మీ, అనసూయ, ప్రదీప్, శ్రీముఖి, రవిలు ఒకే చోట కలిశారు. దీనికి సంబంధించి ఫోటోలను తన ఫేస్ బుక్ పేజీలో అనసూయ పోస్ట్ చేసింది.

ఒకరికొకరు స్పూర్తిగా నిలుస్తూ సామర్థ్యానికి తగ్గట్టు ప్రతిభ కనబరిచేలా సహాయం చేసుకుంటామంటోంది అనసూయ. అంతేకాకుండా తన పనితీరుతో పాటూ, తన టాలెంటెడ్ సహచర యాంకర్ల పనితీరును చూసి గర్వపడుతున్నానంటూ ఫేస్ బుక్లో పోస్ట్ చేసింది.



Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement