ఆ సీక్వెల్స్ కోసం ఎదురు చూస్తున్నా..! | i am wating for pk 2 Sequels sasy Aamir Khan | Sakshi
Sakshi News home page

ఆ సీక్వెల్స్ కోసం ఎదురు చూస్తున్నా..!

Published Thu, Jun 4 2015 11:36 PM | Last Updated on Wed, Apr 3 2019 6:23 PM

ఆ సీక్వెల్స్ కోసం ఎదురు చూస్తున్నా..! - Sakshi

ఆ సీక్వెల్స్ కోసం ఎదురు చూస్తున్నా..!

 ఇటీవల కాలంలో బాలీవుడ్‌లో వచ్చిన అనేక సీక్వెల్స్ ఘనవిజయం సాధించాయి. దాంతో అందరి దృష్టి సీక్వెల్స్‌పై పడ్డాయి. ఆ లిస్ట్‌లో ముందున్న దర్శకుడు రాజ్‌కుమార్ హిరానీ. ఇప్పటికే ఆయన ‘మున్నాభాయ్’ సిరీస్‌లో ఇంకో భాగాన్ని రూపొందించడానికి సిద్ధంగా ఉన్నారు. ఈ విషయాన్ని స్వయంగా ఆమిర్ ఖాన్ వెల్లడించారు. ‘‘రాజ్‌కుమార్ హిరానీ ఇప్పుడు ‘మున్నాభాయ్’ సిరీస్ మీద వర్క్ చేస్తున్నారు. అలాగే ‘పీకె’, ‘త్రీ ఇడియట్స్’ చిత్రాల కొనసాగింపుల కోసం ఆయన కసరత్తులు చేస్తున్నారు. నాకూ ఆ సీక్వెల్స్ చేయాలనే ఉంది. ఆయన మొదట ఏ స్క్రిప్ట్‌తో వస్తారోనని నేనూ మీలాగే ఎదురు చూస్తున్నా’’ అని చెప్పారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement