
'అంగరక్షకులు, కెమెరా లైట్ల వెలుగులు నచ్చవు'
ముంబై: తనకు స్టార్డంలపై అంత నమ్మకం లేదని బాలీవుడ్ నటుడు, జాతీయ అవార్డు గ్రహీత సైఫ్ ఆలీఖాన్ తెలిపారు. ప్రస్తుతం టిగ్మన్షు ధూలియా దర్శకత్వంలో రూపొందుతున్న 'బుల్లెట్ రాజా' సినిమాతో బిజీగా ఉన్న సైఫ్.. సినిమా నుంచి వచ్చే కీర్తి ప్రతిష్టలకు, స్టార్డంలకు ప్రాధాన్యం ఇవ్వనని స్పష్టం చేశాడు. అది తన కెరీలో ఎప్పటికీ ముఖ్య భూమిక పోషించదని తెలిపాడు. బాధ్యాతయుతమైన వ్యక్తిగా ఉండటానికే తన తొలి ప్రాధాన్యత అని తెలిపాడు. ముగ్గురు అంగరక్షకులు, కెమెరా లైట్ల వెలుగులు అనేవి తనకు నచ్చవన్నాడు. నటనంటే తనకు ఎంత ఇష్టమని, దాని ద్వారా ప్రతి ఫలం వస్తే సంతోషిస్తానన్నాడు.
డబ్బు సంపాదన పైనా బాగానే ఆసక్తి ఉంది. అంతవరకూ బాగానే ఉన్నా వాటి నుంచి వచ్చే కీర్తిపై నమ్మకం మాత్రం లేదని సైఫ్ తెలిపాడు. తాను సంతోషంగా, సౌఖ్యంగా ఉండాలని కోరుకుంటానని, అందుకోసమే ఎక్కువ విదేశాల్లో గడుపుతానన్నాడు. తన దృష్టిలో అపూర్వ విజయాలను సొంతం చేసుకున్న రాజేశ్ ఖన్నా, అమితాబ్ బచ్చన్లే నిజమైన స్టార్లని అభిప్రాయపడ్డాడు.