బాలీవుడ్ కింగ్ ఖాన్ షారుక్ ఖాన్‌కి నచ్చని విషయాల్లో నిద్రపోవడం ఒకటి. ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన స్వయంగా ఈ విషయం చెప్పారు. ‘‘నా దృష్టిలో నిద్రపోవడం అంటే టైమ్ వేస్ట్ చేస్తున్నట్లే. అందుకే నిద్రపోవడానికి ఇష్టపడను’’ అని షారుక్ పేర్కొన్నారు. మరి.. నిద్ర సరిగ్గా లేకపోతే ఆరోగ్యం పాడవుతుంది కదా అంటే.. ఎంత కావాలో అంతే నిద్రపోతా అంటున్నారు. మీ జీవితంలో మీకు స్ఫూర్తిగా నిలిచిన స్త్రీల గురించి చెప్పండి? అని ఆ కార్యక్రమంలో షారుక్‌ని అడిగితే – ‘‘నలుగురు ఉన్నారు.
మా అమ్మగారు, నా సోదరి, నా భార్య, నా కూతురు’’ అన్నారు. ఇక సినిమాల విషయానికి వస్తే.. ఈ మధ్యకాలంలో షారుక్ చేసిన సినిమాలు ఆశించిన ఫలితం ఇవ్వలేకపోయాయి. ముఖ్యంగా 2018 డిసెంబర్‌లో భారీ అంచనాల నడుమ విడుదలైన ‘జీరో’ పరాజయాన్ని చవి చూసింది. దాంతో కథల విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నారు షారుక్. అందుకే ఏడాది పైగా అవుతున్నా ఇంకా కొత్త సినిమా ప్రకటించలేదు. ‘మున్నాభాయ్, 3 ఇడియట్స్, పీకే’ చిత్రాల ఫేమ్ రాజ్‌కుమార్ హిరానీ దర్శకత్వంలో త్వరలో ఓ సినిమాని ప్రకటించనున్నారట.
Comments
Please login to add a commentAdd a comment