
'పెద్ద సినిమాలు నిర్మించే సామర్థ్యం లేదు'
ముంబై: బాలీవుడ్ నటి ప్రియాంక చోప్రా(32) కొత్తగా ఏర్పాటు చేసిన నిర్మాణ సంస్థలో చిన్న సినిమాలకే ఆస్కారం ఉందట. ప్రస్తుతం ప్రియాంక సినీ ప్రొడక్షన్ లో ' మేడమ్ జీ' చిత్రం రూపొందుతున్న సంగతి తెలిసిందే. అయితే తన బ్యానర్ లో చిన్న సినిమాలను మాత్రమే తెరకెక్కించే యోచనలో ఉన్నామన్నారు. సెట్స్ లో చాలా మంది అసిస్టెంట్ డైరెక్టర్లను కలిసినా పెద్ద సినిమాలు తీసే సామర్థ్యం తమకు లేదని ఆమె తెలిపారు. టాలెంట్ ఉన్న వాళ్లను వెలికి తీసే చిన్న సినిమాలు తీయడమే తన ఉద్దేశమని ఆమె తెలిపారు.
ప్రస్తుతం రూపొందుతున్న ఈ చిత్రం ఒక ఐటమ్ గర్ల్ కథాంశంతో రూపొందుతున్నట్లు ప్రియాంక తెలిపారు. ఇందులో భాగంగానే తాను ఆఫీస్ కు వెళ్లి నిర్మాతగా నిర్ణయాలను తీసుకోవడం తాను ఎంజాయ్ చేస్తున్నానని ఆమె తెలిపారు.