నేను తగ్గాను... విద్యాబాలన్ తగ్గాలి! | I Reduced ... Vidya will be reduced! | Sakshi
Sakshi News home page

నేను తగ్గాను... విద్యాబాలన్ తగ్గాలి!

Published Sun, Jun 21 2015 12:43 AM | Last Updated on Sun, Sep 3 2017 4:04 AM

నేను తగ్గాను... విద్యాబాలన్ తగ్గాలి!

నేను తగ్గాను... విద్యాబాలన్ తగ్గాలి!

చాక్లెట్ బోయ్‌లా కనిపించే ప్రిన్స్‌కి నిజానికి చాక్లెట్స్ అంటే కాదు.. పిజ్జాలంటే బోల్డంత ఇష్టం. అందుకే అప్పుడప్పుడూ ఓ పట్టు పడుతుంటారు. ఇంతకీ ఇప్పుడు పిజ్జాల గురించి ఎందుకు చెబుతున్నామనుకుంటున్నారా? ఈ 26న విడుదల కానున్న ‘వేర్ ఈజ్ విద్యాబాలన్’ చిత్రంలో ప్రిన్స్ పిజ్జా డెలివరీ బాయ్‌గా నటించారు. శ్రీనివాస్ దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందింది.
 
 క్రిష్ణబద్రి, శ్రీధర్‌రెడ్డి సమర్పణలో శ్రీ భ్రమరాంబ క్రియేషన్స్ పతాకంపై ఎల్. వేణుగోపాలరెడ్డి, పి.లక్ష్మి నర్శింహారెడ్డి ఈ చిత్రాన్ని నిర్మించారు. ఇప్పటివరకూ తాను చేసిన చిత్రాలకు, ఈ చిత్రానికీ ఏమాత్రం పోలిక లేదనీ, పాత్ర కూడా చాలా విభిన్నంగా ఉంటుందని ప్రిన్స్ చెబుతూ -‘‘నటుడిగా, లుక్ పరంగా ఈ చిత్రం నాకు మంచి పేరు తెస్తుంది. అందులో ఏమాత్రం సందేహం లేదు. శ్రీనివాస్‌గారు ఎంత అద్భుతంగా కథ చెప్పారో అంతే అద్భుతంగా తీశారు. విద్యాబాలన్ కోసం సినిమాలో ఉన్న నటీనటులందరం వెతుకుంటాం.
 
 ఎవరా విద్యాబాలన్? అనేది సినిమాలో చూస్తేనే బాగుంటుంది. ఇది క్రైమ్, కామెడీ మూవీ. నేను కూడా కామెడీ చేశా’’ అని చెప్పారు. విద్యాబాలన్ గురించి నాలుగు మాటలు చెబుతారా? అనడిగితే -‘‘విద్యాబాలన్ నాకిష్టమైన నటి. ‘డర్టీ పిక్చర్’, ‘కహానీ’.. ఇలా ఆమె నటించిన సినిమాలు చూశాను. అయితే, ఈ మధ్య ఆమె కొంచెం లావయ్యింది. తగ్గితే బాగుంటుందనుకుంటున్నా’’ అని ప్రిన్స్ అన్నారు. మీరు.. తగ్గినట్లున్నారు? అనడగితే -‘‘కొంచెం సన్నబడితే బాగుంటుందని కొంతమంది అన్నారు. అందుకని తగ్గాను’’ అని చెప్పారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement