'నాది ఆకర్షించే అందం కాదంట'
లండన్: పెరల్ హార్బర్ చిత్రం కోసం తనను నాజూకుగా తయారవ్వమని డైరెక్టర్ మైఖెల్ బే చెప్పినట్లు ప్రముఖ హాలీవుడ్ నటి కేట్ బెకిన్ సేల్ తెలిపింది. 2001న విడుదలైన రోమాంటిక్ యాక్షన్ చిత్రం పెరల్ హార్బర్ చిత్రంలో తాను నటించే నర్సు పాత్రకుగానూ ఆయన స్లిమ్ గా మారాలని సలహా ఇచ్చినట్లు చెప్పింది. అందుకోసం తనను బే కాస్తంత వర్కవుట్ చేయమన్నాడని తెలిపింది.
ఆయన తనను కలిసి చెప్పేంత వరకు కూడా తన ఫిట్ నెస్పై ఎప్పుడూ అనుమానం లేదని కూడా ఆమె చెప్పింది. అయితే, 1940లో ఓ లెఫ్టినెంట్ నర్సు పాత్రలో స్లిమ్ గా కనిపించాల్సిన అవసరం ఎందుకో తనకు అర్ధం కాలేదని చెప్పింది. దీంతోపాటు చిత్ర ప్రమోషన్ సందర్బంగా కూడా బే తనది ఆకర్షించే రూపుకాదని వ్యాఖ్యానించి తన మనసు ఇబ్బంది పెట్టాడని చెప్పింది. ఈ చిత్రంలో ప్రధాన పాత్రలు పోషించిన బెన్ ఆఫ్లెక్, జోష్ హార్ట్ నెట్లను మాత్రం తెగ పొగిడినట్లు వివరించింది.