Kate Beckinsale
-
కమెడియన్ తో డేటింగ్ చేయట్లేదన్న హీరోయిన్
లండన్: తన క్లోజ్ ఫ్రెండ్, కమెడియన్ డేవిడ్ విలియమ్స్ తో డేటింగ్ చేస్తున్నట్టు వచ్చిన వార్తలను హాలీవుడ్ నటి కేట్ బెకిన్ సేల్ తోసిపుచ్చింది. విలియమ్స్ తనకు స్నేహితుడు మాత్రమేనని స్పష్టం చేసింది. గతవారం వీరిద్దరూ కలిసి డిన్నర్ చేసిన ఫొటోలు వెలుగులోకి రావడంతో కేట్, డేవిడ్ ప్రేమలో పడ్డారని వార్తలు వచ్చాయి. వీటిపై ఆమె ఘాటుగా స్పందించింది. 'విలియమ్స్ తో డిన్నర్ కు వెళ్లినంతమాత్రానా ప్రేమించుకుంటున్నామని రాసేస్తారా? మీమిద్దరం స్నేహితులం మాత్రమే. మా మధ్య ఫ్రెండ్ షిప్ తప్ప ఏంలేదు. గత 16 ఏళ్లుగా మేము స్నేహం కొనసాగిస్తున్నాం. అతడి కోసం నేను టాటూ వేయించుకోలేద'ని 42 ఏళ్ల కేట్ బెకిన్ సేల్ పేర్కొంది. 2010లో డచ్ మోడల్ లారా స్టోన్ ను పెళ్లాడిన డేవిడ్ 2015లో ఆమె నుంచి విడిపోయాడు. డేవిడ్ కు మూడేళ్ల కొడుకు ఉన్నాడు. 2004లో దర్శకుడు లెన్ వైజ్మన్ ను పెళ్లాడిన కేట్ పదేళ్ల తర్వాత విడాకులు తీసుకుంది. ఆమెకు ఒక కూతురు ఉంది. -
'నాది ఆకర్షించే అందం కాదంట'
లండన్: పెరల్ హార్బర్ చిత్రం కోసం తనను నాజూకుగా తయారవ్వమని డైరెక్టర్ మైఖెల్ బే చెప్పినట్లు ప్రముఖ హాలీవుడ్ నటి కేట్ బెకిన్ సేల్ తెలిపింది. 2001న విడుదలైన రోమాంటిక్ యాక్షన్ చిత్రం పెరల్ హార్బర్ చిత్రంలో తాను నటించే నర్సు పాత్రకుగానూ ఆయన స్లిమ్ గా మారాలని సలహా ఇచ్చినట్లు చెప్పింది. అందుకోసం తనను బే కాస్తంత వర్కవుట్ చేయమన్నాడని తెలిపింది. ఆయన తనను కలిసి చెప్పేంత వరకు కూడా తన ఫిట్ నెస్‌పై ఎప్పుడూ అనుమానం లేదని కూడా ఆమె చెప్పింది. అయితే, 1940లో ఓ లెఫ్టినెంట్ నర్సు పాత్రలో స్లిమ్ గా కనిపించాల్సిన అవసరం ఎందుకో తనకు అర్ధం కాలేదని చెప్పింది. దీంతోపాటు చిత్ర ప్రమోషన్ సందర్బంగా కూడా బే తనది ఆకర్షించే రూపుకాదని వ్యాఖ్యానించి తన మనసు ఇబ్బంది పెట్టాడని చెప్పింది. ఈ చిత్రంలో ప్రధాన పాత్రలు పోషించిన బెన్ ఆఫ్లెక్, జోష్ హార్ట్ నెట్లను మాత్రం తెగ పొగిడినట్లు వివరించింది.