మంచివాడై ఉండాలి | 'I Will Marry A Boy Decided By My Parents' | Sakshi
Sakshi News home page

మంచివాడై ఉండాలి

Published Wed, Feb 11 2015 3:04 AM | Last Updated on Wed, Apr 3 2019 9:12 PM

మంచివాడై ఉండాలి - Sakshi

మంచివాడై ఉండాలి

మనువాడేవాడు మంచివాడై ఉండాలంటున్నారు నటి నయనతార. ఈ సంచలన తార ఇప్పటికే రెండుసార్లు ప్రేమలో ఫెయిల్ అయిన విషయం తెలిసిందే. తొలిసారి శింబుతోనూ అది కలసి రాకపోవడంతో మరోసారి నృత్యదర్శకుడు నటుడు, దర్శకుడు ప్రభుదేవాతోను డీప్‌లవ్‌లో పడ్డారు. ఆ ప్రేమ పటాపంచలైంది. పాపం ప్రభుదేవా కోసం క్రిస్టియన్ మతం నుంచి నయనతార హిందూమతం కూడా స్వీకరించారు. నటనకు కూడా దూరమయ్యారు. అయినా ఇక పెళ్లే తరువాయి అని అనుకుంటున్న సమయంలో ప్రభుదేవాతో విభేదాలు వచ్చి విడిపోవడానికి దారి తీశాయి.

దాంతో మళ్లీ నటనపై దృష్టి సారించారు. రీ ఎంట్రీలోనూ యమ క్రేజ్ హీరోయిన్‌గా వెలుగొందడం ఆమె అదృష్టమే. ప్రస్తుతం ఇదు నమ్మ ఆలు, మాయ, తనీ ఒరువన్, మాస్, నానుం రౌడీ దాన్, నన్భేండా చిత్రాల్లో నటిస్తున్నారు. నయనతార మూడు పదుల వయసు దాటారు. దీంతో పెళ్లి ఎప్పుడన్న ప్రశ్నల పరంపరను ఆమె ఎదుర్కొంటున్నారు. వాటికి నయనతార ఇస్తున్న బదులేమిటో తెలుసా? తానేమిటో తన తల్లిదండ్రులు బాగా అర్థం చేసుకున్నారని, తన మనోభావాలు ఇష్టాయిష్టాలు వారికే తెలుసన్నారు. అదే విధంగా తన తల్లిదండ్రులపై తనకు చాలా నమ్మకం ఉందని పేర్కొన్నారు. తనను మనువాడే వాడు మంచి మనసున్న వాడై ఉండాలని అలాంటి వ్యక్తిని తనతల్లిదండ్రులే ఎంపిక చేస్తారని అన్నారు. వరుడి అన్వేషణ బాధ్యతను వారికే వదిలి పెట్టానన్నారు. వారు నిర్ణయించిన వ్యక్తితో ఏడుడుగులు నడవడానికి సిద్ధంగా ఉన్నానని నయనతార స్పష్టం చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement