ఆ ఒక్కరోజు మాత్రం లవర్ ఉంటే బాగుంటుందనిపిస్తుంది! | If a one-day experience that's Lover :Taapsee | Sakshi
Sakshi News home page

ఆ ఒక్కరోజు మాత్రం లవర్ ఉంటే బాగుంటుందనిపిస్తుంది!

Published Sun, Dec 22 2013 12:38 AM | Last Updated on Mon, Aug 13 2018 3:04 PM

ఆ ఒక్కరోజు మాత్రం లవర్ ఉంటే బాగుంటుందనిపిస్తుంది! - Sakshi

ఆ ఒక్కరోజు మాత్రం లవర్ ఉంటే బాగుంటుందనిపిస్తుంది!

నాన్‌స్టాప్‌గా పని చేసినప్పుడు కొంత రిలాక్స్ అయితే బాగుంటుందని ఎవరికైనా అనిపిస్తుంది. ఇటీవల తాప్సీకి అలానే అనిపించింది. హిందీ చిత్రం ‘రన్నింగ్ షాదీ డాట్ కామ్’ కోసం 45 రోజుల పాటు గ్యాప్ లేకుండా షూటింగ్‌లో పాల్గొన్నారామె. అందుకని ఐదు రోజులు బ్రేక్ తీసుకున్నారు తాప్సీ. ఈరోజుతో ఆ బ్రేక్‌కి ఫుల్‌స్టాప్ పెట్టి, ‘ముని 3’ చిత్రం షూటింగ్‌లో పాల్గొనబోతున్నారు. సినిమాల సంగతి అలా ఉంచితే.. తాప్సీ లవ్‌లైఫ్ గురించి తెలుసుకుందాం. 
 
 ఇప్పటివరకు తను అస్సలు ప్రేమలో పడలేదట. దీని గురించి తాప్సీ మాట్లాడుతూ -‘‘ఇప్పుడున్నంత అందంగా అప్పట్లో నేను ఉండేదాన్ని కాదు. అందుకే ఐ లవ్ యు చెప్పే సాహసం ఎవరూ చేయలేదు. ఇప్పుడు నేను అందంగా ఉన్నా ఎవరూ ఐ లవ్ యు చెప్పడంలేదు. దానికి కారణం ఇప్పుడు నేను స్టార్‌ని. చెంపలు వాయించేస్తానని భయపడుతున్నారేమో. అయినా ఈ సింగిల్ లైఫ్ బాగానే ఉంది. కానీ, ప్రేమికుల దినోత్సవం నాడు మాత్రం మనకు లవర్ ఉంటే బాగుండేదనిపిస్తుంది. ఎందుకంటే, ప్రేమికులందరూ బహుమతులు ఇచ్చి, పుచ్చుకోవడం, ఈ ప్రపంచంతో సంబంధం లేనట్లు కబుర్లు చెప్పుకోవడం చూస్తే భలే అనిపిస్తుంది’’ అని చెప్పారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement