పులిగా ఇళయదళపతి? | 'Ilayathalapathy' Vijay Beats Ajith, Suriya, Rajinikanth | Sakshi
Sakshi News home page

పులిగా ఇళయదళపతి?

Published Sat, Jan 3 2015 2:07 AM | Last Updated on Sat, Sep 2 2017 7:07 PM

పులిగా ఇళయదళపతి?

పులిగా ఇళయదళపతి?

ఇళయదళపతి విజయ్ హీరోగా న టిస్తున్న చిత్రానికి పులి అనే టైటిల్ పరీశీలనలో ఉన్నట్టు కోలీవుడ్‌లో తాజాగా జరుగుతున్న ప్రచారం. విజయ్ నటిస్తున్న 58వ చిత్రానికి శింబుదేవన్ దర్శకత్వం వహిస్తున్న విషయం తెలిసిందే. క్రేజీ హీరోయిన్లు హనిక్స, శ్రుతిహాసన్‌లు ఇళయ దళపతితో జోడీకడుతున్నారు. ఈ చిత్రంలో అతిలోక సుందరి శ్రీదేవి మహారాణిగా ముఖ్యపాత్ర పోషిస్తున్నారు. విజయ్ పీఆర్వో పీటీ సెల్వకుమార్ భారీ ఎత్తున నిర్మిస్తున్న ఈ సోషియో ఫాంటసీ చిత్రం షూటింగ్ శరవేగంగా జరుపుకుంటోంది.

ప్రస్తుతం చెన్నైలో ఓ భారీ సెట్‌లో చిత్రీకరణ జరుపుకుంటున్న ఈ చిత్రం యూనిట్ త్వరలో మైసూర్‌కు పయనం కానుంది. రజనీ కాంత్ లింగా షూటింగ్ జరిగిన షెట్‌లో విజయ్ చిత్ర షూటింగ్ సాగనుంది. కాగా, ఈ చిత్రానికి ఇంతకుముదు మారీషన్ అనే టైటిల్ పరిశీలనకు వచ్చింది. ఆ తర్వాత గరుడ టైటిల్ నిర్ణయించినట్టు సమాచారం. అయితే, తాజాగా ఆ చిత్రానికి విజయ్ క్యారెక్టర్‌కు తగ్గట్టుగా పులి పేరు పెట్టేందుకు పరిశీలన జరుపుతున్నట్టు ప్రచారం సాగుతోంది. అయితే, ఇదే టైటిల్‌తో ఇంతకుముందు ఎస్‌జే.సూర్య విజయ్ హీరోగా సినిమాను రూపొందించాలని నిర్ణయించారు.

అది అనివార్య కారణాలతో ముందుకు సాగలేదు. అదే టైటిల్‌తో ఎస్‌జే.సూర్య తెలుగులో పవన్‌కల్యాణ్ హీరోగా చిత్రాన్ని తెరకెక్కించారు. అయితే, ఆ టైటిల్‌ను ఎస్‌జే సూర్య తన ఆధీనంలో ఉంచుకుని ఉన్నారు. ఈ విషయం గురించి ఆయన ఇంతవరకు స్పందించ లేదు. ఒక వేళ ఆయన గనుక టైటిల్‌ను ఇవ్వని పక్షంలో తదుపరి టైటిల్‌ను వెతుక్కోవాల్సిన వంతు విజయ్ చిత్ర యూనిట్‌కు ఏర్పడనుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement