Vijay hero
-
దిల్ రాజు ఇంట్లో వారసుడు సంబరాలు (ఫొటోలు)
-
అదే జరిగితే ' అంతకుముందు.. ఆ తర్వాత'.. డైరెక్టర్ లింగుస్వామి సీరియస్..!
అనువాద చిత్రాల వివాదం మరింత ముదిరేలా కనిపిస్తోంది. తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతికి 'వారిసు' రిలీజ్‌పై వివాదం ఇంకా కొనసాగుతోంది. తాజాగా ఈ అంశంపై దర్శకుడు లింగుస్వామి స్పందించారు. టాలీవుడ్ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ నిర్ణయంపై ఆయన అభ్యంతరం వ్యక్తం చేశారు. దీనిపై ఏం చేయాలో మాకు తెలుసన్నారు. (చదవండి: టాలీవుడ్లో ‘అనువాదం’ పై వివాదం) సంక్రాంతికి కేవలం తెలుగు చిత్రాలకు మాత్రమే థియేటర్ల కేటాయింపుల్లో ప్రాధాన్యత ఇవ్వాలని తెలుగు చలన చిత్ర నిర్మాతల మండలి చేసిన ప్రకటనపై కోలీవుడ్ దర్శక, నిర్మాతలు విమర్శలు చేశారు. ఇలా వ్యవహరించడం పద్ధ కాదని డైరెక్టర్ లింగుస్వామి అన్నారు. ఒకవేళ ఆ విధంగానే జరిగితే తీవ్ర పరిణామాలు ఉంటాయని లింగుస్వామి హెచ్చరించారు. ఇక తెలుగు సినీ నిర్మాతల మండలి లేఖపై తమిళ సినీ దర్శకులు ఆగ్రహంగా ఉన్నారు. తెలుగు రాష్ట్రాల్లో వారిసుకు రావాల్సిన థియేటర్లు లభించకపోతే పరిస్థితి పూర్తిగా మారుతుందన్నారు. వారు ఇలాగే వ్యవహరిస్తే 'వారిసుకు ముందు, వారిసుకు తర్వాత' అనేలా ఉంటుందని దర్శకుడు లింగుసామి అన్నరు. విజయ్ హీరోగా వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం 'వారిసు'. దిల్‌రాజు నిర్మాత. యూత్‌ఫుల్, ఫ్యామిలీ ఎంటర్టైనర్గా సిద్ధమైన ఈ చిత్రాన్ని తెలుగులో 'వారసుడు' పేరుతో సంక్రాంతికి విడుదల చేయాలని చిత్రబృందం నిర్ణయించారు. -
పొలిటికల్ ఎంట్రీపై విజయ్‌పై హాట్ కామెంట్స్..
సాక్షి, చెన్నై: సినిమాల్లో దళపతిగా ఉన్న తాను తలైవా (నాయకుడి)గా అవతరించడం అనేది కాలం చేతుల్లోనే ఉందని సినీ నటుడు విజయ్ వ్యాఖ్యానించారు. రాజకీయాల్ని నిశితంగా పరిశీలిస్తున్నానని, ఈ పయనాన్ని కాలంతో పాటుగా అభిమానులే నిర్ణయించాలని స్పష్టం చేశారు. సినీ నటుడు విజయ్ రాజకీయ ప్రవేశంపై చర్చ తరచూ తెర మీదకు వస్తున్న విషయం తెలిసిందే. అయితే, ఈసారి బీస్ట్ చిత్రం విడుదల వేళ విజయ్ తన స్వరాన్ని మార్చారు. రాజకీయంగా చర్చకు తగ్గ వ్యాఖ్యల తూటాల్ని పేల్చారు. విజయ్, పూజా హెగ్డే కాంబినేషన్లో నెల్సన్ దర్శకత్వం వహించిన బీస్ట్ చిత్రం ఈనెల 13న తెర మీదకు రానుంది. ఈ చిత్రం ప్రమోషన్స్‌లో భాగంగా ఓ ఛానల్లో ఆదివారం రాత్రి చిట్‌చాట్ కార్యక్రమం జరిగింది. బీస్ట్ చిత్ర దర్శకుడు నెల్సన్ సంధించిన ప్రశ్నలకు విజయ్ ఇచ్చిన సమాధానాలు రాజకీయంగానే కాకుండా, సినీ రంగంలోనూ చర్చకు దారి తీశాయి. తనదైన శైలిలో.. నెల్సన్ ప్రశ్నలకు తన దైన స్టైల్లో విజయ్ సమాధానాలు ఇచ్చారు. తనకు దేవుడి మీద నమ్మకం ఉందని, ఆలయాలు, దర్గాలు, దేవాలయాలకు వెళ్తూనే ఉంటానని విజయ్ వివరించారు. అలాగే తండ్రి ఎస్ఏ చంద్రశేఖర్‌తో ఉన్న విభేదాలను ప్రస్తావిస్తూ, చెట్టుకు వేర్లు ఎలాగో.. ఓ తండ్రి కుటుంబానికి అలాంటి వాడు అని, దేవుడు కనిపించడు.. తండ్రి కనిపిస్తాడు అని సమాధానం ఇవ్వడం ఆసక్తికరంగా మారింది. ఇక తన కుమారుడు సంజయ్ సినీరంగ ప్రవేశం గురించి కూడా ఈ సందర్భంగా ప్రస్తావించారు. సంజయ్ తెర మీద కనిపిస్తాడా...? లేదా కెమెరా వెనుక ఉంటాడా..? అనేది తెలియదని, తాను అందరిలాగే ఎదురు చూస్తున్నట్లుగా పేర్కొన్నారు. అయితే, అవకాశాలు వస్తున్న మాట మాత్రం వాస్తవమేనని తెలిపారు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో సైకిల్ పయనం గురించి గుర్తు చేస్తూ, ఇది యాధృచ్ఛికంగా జరిగిందని, ఇందులో ఎలాంటి దురుద్దేశం లేదని స్పష్టం చేశారు. ఇటీవలి నగర పాలక, స్థానిక సంస్థల ఎన్నికల్లో విజయ్ అభిమానుల గెలుపును గుర్తు చేస్తూ విల్సన్ కొన్ని ప్రశ్నలు సంధించారు. ఇందుకు విజయ్ సమాధానం ఇస్తూ, రాజకీయాలను నిశితంగా పరిశీలిస్తున్నానని వెల్లడించారు. అలాగే, దళపతిగా ఉన్న తాను నాయకుడిగా అవతరించడం అనేది కాలం చేతుల్లో ఉందని, అభిమానులే నిర్ణయిస్తారని ముగించడం రాష్ట్రంలో రాజకీయంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. -
రిలాక్స్డ్గా ఉన్నా..
- సమంత విజయ్ హీరోగా నటించిన తమిళ చిత్రం ‘తెరి’ తమిళనాట ఇప్పుడు హాట్ టాపిక్ . అదే చిత్రం తెలుగులో ‘పోలీసోడు’గా రానుంది. సమంత, అమీ జాక్సన్ కథానాయికలు. ‘రాజా- రాణి’ ఫేమ్ అట్లీ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని ‘దిల్’ రాజు, కలైపులి ఎస్. థాను ఈ నెల 14న విడుదల కానుంది. ‘దిల్’ రాజు మాట్లాడుతూ, ‘‘ ‘రాజా-రాణి’ కథను తెలుగులో తీయాలనుకున్నా. కానీ కుదరలేదు. తెలుగు ప్రేక్షకులకు నచ్చే అంశాలన్నీ ‘పోలీసోడు’లో ఉన్నాయి’’ అని చెప్పారు. కథానాయిక సమంత మాట్లాడుతూ- ‘‘నేను ఇప్పటివరకూ పాతిక సినిమాలు చేశాను. అన్నిటికీ ఏదో రకంగా టెన్షన్ పడ్డాను. కానీ ఈ సినిమా విడుదల కోసం చాలా రిలాక్స్డ్గా ఎదురుచూస్తున్నా’’ అని అన్నారు. ‘‘ఈ ‘పోలీసోడు’ ఎమోషనల్ యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కింది. అందరికీ నచ్చుతుందనే ఆశిస్తున్నా. తమిళంలో ఓ భారీ బడ్జెట్ చిత్రం చేశాకే తెలుగులో సినిమా చేస్తానని గతంలో చెప్పాను. ఇప్పుడిక నా తదుపరి చిత్రం తెలుగులోనే ఉంటుంది’’ అని దర్శకుడు అట్లీ అన్నారు. -
పులిగా ఇళయదళపతి?
ఇళయదళపతి విజయ్ హీరోగా న టిస్తున్న చిత్రానికి పులి అనే టైటిల్ పరీశీలనలో ఉన్నట్టు కోలీవుడ్‌లో తాజాగా జరుగుతున్న ప్రచారం. విజయ్ నటిస్తున్న 58వ చిత్రానికి శింబుదేవన్ దర్శకత్వం వహిస్తున్న విషయం తెలిసిందే. క్రేజీ హీరోయిన్లు హనిక్స, శ్రుతిహాసన్‌లు ఇళయ దళపతితో జోడీకడుతున్నారు. ఈ చిత్రంలో అతిలోక సుందరి శ్రీదేవి మహారాణిగా ముఖ్యపాత్ర పోషిస్తున్నారు. విజయ్ పీఆర్వో పీటీ సెల్వకుమార్ భారీ ఎత్తున నిర్మిస్తున్న ఈ సోషియో ఫాంటసీ చిత్రం షూటింగ్ శరవేగంగా జరుపుకుంటోంది. ప్రస్తుతం చెన్నైలో ఓ భారీ సెట్లో చిత్రీకరణ జరుపుకుంటున్న ఈ చిత్రం యూనిట్ త్వరలో మైసూర్‌కు పయనం కానుంది. రజనీ కాంత్ లింగా షూటింగ్ జరిగిన షెట్‌లో విజయ్ చిత్ర షూటింగ్ సాగనుంది. కాగా, ఈ చిత్రానికి ఇంతకుముదు మారీషన్ అనే టైటిల్ పరిశీలనకు వచ్చింది. ఆ తర్వాత గరుడ టైటిల్ నిర్ణయించినట్టు సమాచారం. అయితే, తాజాగా ఆ చిత్రానికి విజయ్ క్యారెక్టర్‌కు తగ్గట్టుగా పులి పేరు పెట్టేందుకు పరిశీలన జరుపుతున్నట్టు ప్రచారం సాగుతోంది. అయితే, ఇదే టైటిల్‌తో ఇంతకుముందు ఎస్జే.సూర్య విజయ్ హీరోగా సినిమాను రూపొందించాలని నిర్ణయించారు. అది అనివార్య కారణాలతో ముందుకు సాగలేదు. అదే టైటిల్‌తో ఎస్జే.సూర్య తెలుగులో పవన్‌కల్యాణ్ హీరోగా చిత్రాన్ని తెరకెక్కించారు. అయితే, ఆ టైటిల్‌ను ఎస్జే సూర్య తన ఆధీనంలో ఉంచుకుని ఉన్నారు. ఈ విషయం గురించి ఆయన ఇంతవరకు స్పందించ లేదు. ఒక వేళ ఆయన గనుక టైటిల్‌ను ఇవ్వని పక్షంలో తదుపరి టైటిల్‌ను వెతుక్కోవాల్సిన వంతు విజయ్ చిత్ర యూనిట్‌కు ఏర్పడనుంది. -
కమల్ బాటలో విజయ్
సినిమాకు సంబంధించి నంతవరకు ప్రయోగాలంటే ప్రఖ్యాత నటుడు కమలహాసన్ చేయాలి అన్నంతగా ఆయన ఖ్యాతిగాంచారు. అలాంటి నటుడి బాటలో ఇళయదళపతి విజయ్ పయనిస్తున్నారు. అంతేకాదు కమల్ మురిపించిన మరుగుజ్జు పాత్రలో విజయ్ ఆయన్ని మరిపించే ప్రయత్నానికి సిద్ధం అయ్యారని తెలుస్తోంది. విజయ్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం మారిశన్. ఈ చిత్రంలో ఆయనకు జంటగా శ్రుతిహాసన్, హన్సిక నటిస్తున్నారు. ముఖ్యమైన పాత్రలో అతిలోక సుందరి శ్రీదేవి, ప్రతి నాయకుడిగా సుదీప్ నటిస్తున్నారు. యువ దర్శకుడు శింబుదేవన్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో విజయ్ ద్విపాత్రాభినయం చేస్తున్నారు. అందులో ఒకటి మరుగుజ్జు పాత్ర అని తెలుస్తోంది. నటి శ్రీదేవి మహరాణిగా నటిస్తున్నారు. ఆయన కూతురిగా హన్సిక, దళపతిగా సుదీప్ నటిస్తున్నట్లు సమాచారం. ఇది సోషియల్ ఫాంటసీ కథా చిత్రంగా భారీ బడ్జెట్‌తో రూపొందుతోంది. విచిత్ర సహోదరులు చిత్రంలో కమలహాసన్ మూడు పాత్రలు పోషించారు. అందులో ఒకటి మరుగుజ్జు పాత్ర. ఆ తరువాత ఇప్పటి వరకు పూర్తిస్థాయి మరుగుజ్జు పాత్రను ఎవరూ పోషించలేదు. ఇన్నాళ్లకి విజయ్ ఆ సాహసం చేస్తున్నారన్నమాట. మరి కమల్ మరుగుజ్జు పాత్రను విజయ్ మరిపిస్తారా? వేచిచూడాల్సిందే.