కమల్ బాటలో విజయ్ | Vijay in 58th Film Marisan | Sakshi
Sakshi News home page

కమల్ బాటలో విజయ్

Published Fri, Nov 28 2014 2:27 AM | Last Updated on Fri, Aug 17 2018 2:34 PM

కమల్ బాటలో విజయ్ - Sakshi

కమల్ బాటలో విజయ్

సినిమాకు సంబంధించి నంతవరకు ప్రయోగాలంటే ప్రఖ్యాత నటుడు కమలహాసన్ చేయాలి అన్నంతగా ఆయన ఖ్యాతిగాంచారు. అలాంటి నటుడి బాటలో ఇళయదళపతి విజయ్ పయనిస్తున్నారు. అంతేకాదు కమల్ మురిపించిన మరుగుజ్జు పాత్రలో విజయ్ ఆయన్ని మరిపించే ప్రయత్నానికి సిద్ధం అయ్యారని తెలుస్తోంది. విజయ్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం మారిశన్. ఈ చిత్రంలో ఆయనకు జంటగా శ్రుతిహాసన్, హన్సిక నటిస్తున్నారు. ముఖ్యమైన పాత్రలో అతిలోక సుందరి శ్రీదేవి, ప్రతి నాయకుడిగా సుదీప్ నటిస్తున్నారు. యువ దర్శకుడు శింబుదేవన్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో విజయ్ ద్విపాత్రాభినయం చేస్తున్నారు.

అందులో ఒకటి మరుగుజ్జు పాత్ర అని తెలుస్తోంది. నటి శ్రీదేవి మహరాణిగా నటిస్తున్నారు. ఆయన కూతురిగా హన్సిక, దళపతిగా సుదీప్ నటిస్తున్నట్లు సమాచారం. ఇది సోషియల్ ఫాంటసీ కథా చిత్రంగా భారీ బడ్జెట్‌తో రూపొందుతోంది.  విచిత్ర సహోదరులు చిత్రంలో కమలహాసన్ మూడు పాత్రలు పోషించారు. అందులో ఒకటి మరుగుజ్జు పాత్ర. ఆ తరువాత ఇప్పటి వరకు పూర్తిస్థాయి మరుగుజ్జు పాత్రను ఎవరూ పోషించలేదు. ఇన్నాళ్లకి విజయ్ ఆ సాహసం చేస్తున్నారన్నమాట. మరి కమల్ మరుగుజ్జు పాత్రను విజయ్ మరిపిస్తారా? వేచిచూడాల్సిందే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement