లైఫ్‌ అంతా నటిగానే... | Imaikkaa Nodigal released on august 24 | Sakshi
Sakshi News home page

లైఫ్‌ అంతా నటిగానే...

Published Sun, Aug 5 2018 3:11 AM | Last Updated on Sun, Aug 5 2018 3:11 AM

Imaikkaa Nodigal released on august 24 - Sakshi

రాశీ ఖన్నా

లైఫ్‌లో కెరీర్‌ను ఎలా ప్లాన్‌ చేసుకోవాలన్న ఆలోచన ప్రతి ఒక్కరికీ ఏదో ఒక స్టేజ్‌లో వస్తుంది. అలాంటి టైమ్‌లోనే రాశీ ఖన్నా ఓ కీలక నిర్ణయం తీసుకుని ఇంతమంది అభిమానుల మనసు గెలుచుకున్నారు. ఇంతకీ విషయం ఏంటంటే.. రాశీ ఖన్నా ముందు హీరోయిన్‌ అవ్వాలనుకోలేదట.‘‘ అవును..నా కెరీర్‌ను ముందుగా నేను నటిగా ఊహించుకోలేదు. అనుకోకుండా సినిమాల్లోకి వచ్చాను. కానీ ఆ తర్వాత వెండితెరపై నన్ను నేను చూసుకున్న తొలిసారి ఏదో తెలియని అనుభూతి కలిగింది.  నా నటనను ఆడియన్స్‌ ఎంజాయ్‌ చేస్తున్నప్పుడు నేను ఆశ్చర్యపోయాను. అప్పుడే నాలో ఉన్న ప్రతిభ నాకు తెలిసింది. ఒక లైఫ్‌ అంతా నటిగా కొనసాగాలని ఆ క్షణంలో నిర్ణయించుకున్నా’’ అని పేర్కొన్నారు రాశీ ఖన్నా. ఇక ఆమె కోలీవుడ్‌లో ఎంట్రీ ఇస్తున్న తొలి సినిమా ‘ఇమైక్క నొడిగల్‌’ ఈ నెల 24న విడుదల కానుంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement