
భారతదేశం చాలా గొప్పది – యూకె ఎంపీ బాబ్ బ్లాక్‌మేన్
‘‘భారతదేశం చాలా గొప్పది. శాంతికి చిహ్నమైన భారతావనిలో ఏసుక్రీస్తు కథతో సినిమా తీయడం గర్వకారణం. ఈ సినిమా వేడుకలకు ఇండియా వస్తా’’ అన్నారు యునైటెడ్ కింగ్‌డమ్ ఎంపీ బాబ్ బ్లాక్‌మేన్. జీసస్ జీవిత చరిత్ర ఆధారంగా సీహెచ్ బ్రహ్మం దర్శకత్వంలో చంద్రశేఖర్ చంద్ర నిర్మిస్తున్న ‘లోక రక్షకుడు’ లోగోను లండన్ పార్లమెంట్‌లో బాబ్ బ్లాక్‌మేన్ విడుదల చేశారు.
‘‘ప్రజల్లో శాంతి నింపే విధంగా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నాం. ఈ ఏడాది క్రిస్మస్‌కు చిత్రాన్ని విడుదల చేయాలనుకుంటున్నాం’’ అని చంద్రశేఖర్ చంద్ర అన్నారు. ‘లండన్ జీయర్ ట్రస్ట్’కు చెందిన వింజమూరి రాఘసుధ, ‘యూకే తెలుగు ఎన్నారై ఫోరమ్’ సంస్థ సభ్యులు శేఖర్ వేమూరి, సూర్యదేవర ప్రసాదరావు తదితరులు పాల్గొన్నారు. ఈ చిత్రానికి సంగీతం: ఏకే రిసాల్ సాయి, సమర్పణ: చంద్ర పర్వతమ్మ.