
క్యారెక్టర్ స్ట్రాంగ్‌గా ఉంటే.. కాదు.. కాదు.. అదొక్కటే సరిపోదు. వేల్యూస్ గట్టిగా ఉంటే... ఊహూ... ఇదీ సరిపోదు. ఫోకస్ గట్టిగా ఉంటే.. అబ్బా.. ఇది విన్నదే కదా! అమ్మాయి గట్టిగా ఉంటే.. ఆహా.. ఇదండీ విషయం. కుట్టీ గట్టిగా ఉంటే.. నివేథా థామస్‌లా ఉంటుంది.
ఎడ్యుకేషన్ బ్రేక్ అంటూ చిన్న గ్యాప్ తర్వాత ఇప్పుడు రెండు సినిమాలతో బిజీగా ఉన్నారు. ఆ స్మాల్ బ్రేక్ గురించి?
దీన్ని నేనసలు బ్రేక్‌లానే ఫీల్ అవ్వడంలేదు. నేను యాక్టింగ్ స్టార్ట్ చేసినప్పటి నుంచి చదువు, యాక్టింగ్ రెండూ çసమానంగానే చేస్తూ వస్తున్నాను. రెంటిలో ఏదైనా బాగా ఇంపార్టెంట్ అనిపిస్తే అప్పుడు కచ్చితంగా ఒకదానికి బ్రేక్ ఇస్తాను. ఎగ్జామ్స్ ఉన్నప్పుడు యాక్టింగ్‌కి దూరంగా ఉండటం, సినిమాలు చేస్తున్నప్పుడు స్టడీస్‌ని బ్యాలెన్స్ చేయడం... ఇదంతా కామనే నాకు. ప్రస్తుతం ఆర్కిటెక్చర్ లాస్ట్ సెమిస్టర్‌లో ఉన్నాను. సో.. సినిమాకు డెడికేట్ చేసేంత టైమ్ లేదనిపించింది. ముందు గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేశాను. ఇప్పుడు ఫుల్ ఫోకస్ అంతా సినిమా పైనే.
జనరల్‌గా కెరీర్ కోసం ఎడ్యుకేషన్ అని చాలామంది అంటారు. మీకు ఆల్రెడీ కెరీర్ ఉంది. మరి పేరెంట్స్ ప్రెజర్ చేయడం వల్లా? లేక ఎడ్యుకేషన్ అంటే మీకే ఇంట్రెస్టా?
మా పేరెంట్స్ ఇది చెయ్యి, అది చెయ్యి అని ఎప్పుడూ ఫోర్స్ చేయలేదు. నేను చిన్నప్పటి నుంచి మంచి స్టూడెంట్‌ని. ఎడ్యుకేషన్ అంటే బాగా ఇంట్రెస్ట్. ఆర్కిటెక్ట్ చేస్తున్నప్పుడు ఎంత ఇంట్రెస్ట్‌గా చదివానో యాక్టింగ్ కూడా అంతే ఇంట్రెస్ట్‌గా చేస్తాను. ప్రస్తుతం యాక్టింగ్ చేస్తున్నా లాంగ్ రన్‌లో ఎడ్యుకేషన్ హెల్ప్ అవుతుంది. వేరే ఏదైనా చేయాలనుకుంటే డిగ్రీ కంపల్సరీ. అలాగే డిగ్రీ ఉన్నంత మాత్రాన బ్రెడ్ దొరుకుతుందనుకోవడం కూడా పొరపాటు. నాకు ఇంకా పోస్ట్ గ్రాడ్యుయేషన్, డాక్టరేట్ చేయాలని ఉంది.
ఈ సందర్భంగా ఉమెన్ ఎడ్యుకేషన్ గురించి రెండు మంచి మాటలేమైనా?
ఉమెన్‌కి ఎడ్యుకేషన్ చాలా ఇంపార్టెంట్. ప్రస్తుతం స్త్రీ, పురుషులు జెండర్‌ని బట్టి కాకుండా తాము ఎవరనే విషయాన్ని బట్టి గౌరవించుకుంటున్నారు. స్త్రీలకనే కాదు. పురుషులకు కూడా ఎడ్యుకేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇక్కడ అందరూ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే.. ఎడ్యుకేషన్ అంటే రాయడం, చదవడం లేదంటే.. చకాచకా ఇంగ్లిష్‌లో మాట్లాడటమే కాదు. మన బిల్స్ మనమే కట్టుకోగలగటం, మన కార్ టైర్ పంచర్ అయితే మార్చుకోగలగటం, మన లైఫ్‌ని మనం మ్యానేజ్ చేసుకోగలగటం.
జీవితం మన ముందుంచే పజిల్స్‌ని ఎలా సాల్వ్ చేస్తాం అన్న దానికి ఎడ్యుకేషన్ చాలా ఇంపార్టెంట్. ఉమెన్ అంటే కిచెన్‌లోనే ఉండాలి. పెళ్లి జరిగిన తర్వాత వర్క్ చేయకూడదు అనేవి ఇంతకు ముందు ఉండేవి. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి మారింది. ఇంట్లో ఇద్దరు వర్క్ చేయాల్సిన పరిస్థితులు ఉన్నాయి. ఇద్దరు పని చేస్తేనే ఇంటికి కావల్సినవి సమకూర్చుకోగలుగుతారనే పరిస్థితి ఉన్నప్పుడు భార్యకు చదువు లేకపోతే ఎలా? అందుకే ఎడ్యుకేషన్ ఇంపార్టెంట్.
మీ వయసు 22 ఏళ్లే. వయసు చిన్నదైనా చక్కగా చెప్పారు. మరి.. ఇంత యంగ్ ఏజ్‌లో నేమ్, ఫేమ్ వచ్చేశాయి. దీనివల్ల కొంచెం అహం పెరిగే అవకాశం ఉంటుందేమో?
నేను రిచ్ సర్కిల్‌లో పెరగలేదు. సాధారణ అమ్మాయిలానే పెరిగాను. యాక్టింగ్‌లో ఒకలాంటి లగ్జరీ ఉంటుంది. మనకు కావల్సినవి మన దగ్గరకు వచ్చేస్తాయి. 8 ఏళ్ల వయసు నుంచి యాక్ట్ చేస్తున్నాను. లొకేషన్‌లో యాక్ట్ చేసేసి మామూలు అమ్మాయిలా స్కూల్‌కి వెళ్లిపోయేదాన్ని. ఇప్పుడూ అంతే. ఎప్పటిలా ఫ్రెండ్స్‌తో స్పెండ్ చేస్తాను.
నేమ్, ఫేమ్ ఊరికే వచ్చేయవు. కష్టపడ్డవాళ్లకే దక్కుతాయి. ఎప్పటికీ అవి మనతో ఉండాలంటే మనం మామూలుగానే ఉండాలనే క్లారిటీ నాకు ఉంది. అందుకే పొగరు, గర్వం ఏదీ తలకు ఎక్కించుకోలేదు. అసలు నన్ను నేను సెలబ్రిటీని అనుకోను. క్యాజువల్‌గా ఉంటాను. అప్పుడే హ్యాపీగా ఉండగలుగుతాను.
షూటింగ్‌లో జ్యూస్ అడిగితే జ్యూస్.. సూప్ అడిగితే సూప్. కోరినది వచ్చేస్తుంది. ఇంట్లో కూడా అలా జరగాలని కోరుకుంటారా?
ఇంట్లో ఉన్నప్పుడు నా పనులన్నీ నేనే చేసుకుంటాను. వంట కూడా చేస్తాను. ఒకవేళ నేను పెళ్లి చేసుకొని వేరే ఇంటికి వెళ్ళినా నా పనులన్నీ నేనే సొంతంగా చేసుకోవాలి కదా. సో ఇండిపెండెంట్‌గా ఉండటం నేర్చుకోగలగాలి. అలా చేయడం నాకు ఇష్టం. ఇంట్లో గారం చేయడం ఇవన్నీ కూడా నాకు ఇష్టం ఉండదు (నవ్వుతూ).
‘పెళ్లి చేసుకున్నాక...’ అన్నారు కాబట్టి అడుగుతున్నాం. మీ పాయింట్ ఆఫ్ వ్యూలో పెళ్లికి సరైన ఏజ్ ఏంటి? అసలు పెళ్లికి వయసుతో సంబంధం ఉంటుందా?
పెళ్లికి వయసుతో సంబంధం ఉంటుందా? అనే విషయం గురించి నాకు సరిగ్గా తెలియదు. కానీ పెళ్లి చేసుకోవాలనిపించినప్పుడు చేసేసుకోవాలి. వద్దనిపిస్తే వద్దనుకోవడమే. ముందు సెటిల్ అవ్వాలి. నేనైతే జీవితం స్థిరంగా ఉంది అనిపించినప్పుడు తప్పకుండా పెళ్ళి చేసుకుంటాను.
పెళ్ళి తర్వాత కెరీర్‌ని వదిలేస్తారనుకోవచ్చా?
అస్సలు లేదు. యాక్టింగ్ నా ప్రొఫెషన్. ఒక టీచర్‌ను పెళ్లి అయ్యాక మీరు టీచింగ్ మానేస్తారా? అని మనం అడగం కదా. డాక్టర్‌ని కూడా అడగం. సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌ని అడగం. మరి.. యాక్టర్‌ని మాత్రం ఎందుకు అడగాలి? ఇది కూడా ఒక ప్రొఫెషనే. యాక్టింగ్ మానేయడం, మానేయకపోవడం అనే నిర్ణయం భార్యాభర్తలది. ఇద్దరి మధ్య మంచి అండర్‌స్టాండింగ్ ఉండే భార్యాభర్తలు ఒకే నిర్ణయం తీసుకుంటారు.
ఒకవేళ మీ భర్త సినిమాలు మానేయమంటే?
మానను. పెళ్లి తర్వాత కొంచెం బ్రేక్ తీసుకుంటే బాగుంటుందని నాకనిపిస్తే అప్పుడు ఆలోచిస్తాను. కెరీర్ డెసిషన్ పూర్తిగా నాదే.
మ్యారేజ్ గురించి ఇప్పుడు డిస్కస్ చేయడం టూ ఎర్లీ అవుతుంది. లవ్ గురించి మాట్లాడుకుందాం.. స్కూల్ డేస్‌లో ఏమైనా లవ్ లెటర్స్?
ఒక్క లవ్ లెటర్ కూడా రాలేదు. స్కూల్‌లో నాతో మాట్లాడటానికి భయపడేవారు. ఎందుకంటే నేను స్కూల్ లీడర్‌ని. ఏం చెప్పాలనుకున్నా కట్ షార్ట్‌గా చెప్పేసి వెళ్లిపోయేదాన్ని. అలా ఉండటంవల్లే రొమాంటిక్ ప్రపోజల్స్ రాలేదనుకుంటున్నా.
ప్రస్తుతం మీ రిలేషన్‌షిప్ స్టేటస్ ఏంటి?
సింగిల్.
మీ ఫ్యామిలీలో ఎవరూ సినిమాల్లో లేరు కదా?
లేరు.
హీరోయిన్ అవ్వాలని మీరే అనుకున్నారా?
హీరోయిన్ అవ్వాలని కాదు. యాక్టర్ అవ్వాలని అనుకున్నాను. అది నా చాయిస్.
యాక్టర్‌గా మీకు ఎవరు ఇన్‌స్పిరేషన్?
కమల్ సార్ అంటే చాలా ఇష్టం. యాక్టర్‌గా ఆయన్ను రోల్‌మోడల్‌గా తీసుకుంటాను.
డ్రీమ్ రోల్స్ ఏమైనా?
అలాంటివి ఏమీ లేవు. కానీ చేసిన పని, క్యారెక్టర్ శాటిస్‌ఫ్యాక్షన్ ఇవ్వాలని కోరుకుంటాను.
‘పాపనాశం’ (తెలుగు ‘దృశ్యం’) సినిమాలో మీరు బట్టలు మార్చుకుంటున్నప్పుడు రహస్యంగా సెల్‌ఫోన్‌లో ఓ అబ్బాయి వీడియో తీస్తాడు. ఇప్పుడు హీరోయిన్‌గా షూటింగ్స్ కోసం తెలియని ప్రదేశాలకు వెళ్తుంటారు. రహస్య కెమెరాలుంటాయేమోనని భయంగా ఉంటుందా?
సినిమాలో జరిగిన సంఘటనలు బయట జరగాలని రూలేం లేదు. అయితే జరిగే అవకాశం లేకపోలేదు. సినిమాలో ఒక తప్పుడు ఆలోచన ఉన్న వ్యక్తి చేసిన పని అది. నాకు తెలిసి సినిమా యూనిట్స్‌లో అలా తప్పుడు ఆలోచన ఉన్నవాళ్లు ఉండరు. కార్వాన్ (షూటింగ్స్‌లో సెలబ్రిటీలు ఉపయోగించే వాహనం)ని పర్ఫెక్ట్‌గా మెయిన్‌టైన్ చేస్తారు.
మేం బస చేయడానికి ఇచ్చే రూమ్స్ విషయంలో కూడా యూనిట్ తగిన జాగ్రత్తలు తీసుకుంటారని నా నమ్మకం. ఎందుకంటే అలాంటి తప్పులు చేసి, పట్టుబడితే కెరీర్ పోతుంది కదా. లైఫ్‌ని రిస్క్‌లో పెట్టుకోవడానికి ఎవరు రెడీగా ఉంటారు?
రహస్య కెమెరాల గురించి వదిలేద్దాం.. సెలబ్రిటీలు పబ్లిక్‌లోకి వచ్చినప్పుడు అనుమతి తీసుకోకుండా ముఖం మీద సెల్‌ఫోన్ పెట్టి మరీ ఫొటోలు తీస్తే మీకేమనిపిస్తుంది?
మాకది పెద్ద ఇబ్బంది. ఎక్కడ కనిపించినా ఫొటోలు క్లిక్ చేస్తారు. ఒకవేళ ఆ ఫొటోలో మేం బాగాలేకపోయినా, మా ఎక్స్‌ప్రెషన్ కొంచెం డల్‌గా ఉన్నా ఏదో జరిగింది అని వార్తలు అల్లుతారు. మేం పబ్లిక్ ఫిగర్.. కాదనడంలేదు. కానీ మా ప్రైవసీ మాకు ఉంటుంది కదా. నేను ఏ ప్రెస్‌మీట్‌లో పాల్గొన్నా ఎన్ని ఫొటోలు కావాలంటే అన్ని దిగుతాను. అయితే పబ్లిక్‌లో అనుమతి లేకుండా తీస్తే చిరాకుగా ఉంటుంది.
ముఖ్యంగా ఆర్టిస్టులు మేకప్ లేకుండా బయటకు వచ్చినప్పుడు క్లిక్ చేయడం కరెక్ట్ కాదు. మేం ఎక్కడ కనిపించినా స్క్రీన్ మీద కనిపించినట్లే కనిపించాలంటే కుదరదు కదా. మేకప్ లేకుండా మా ఇష్టం వచ్చినట్లు మేం ఉంటాం. షూటింగ్ లేనప్పుడు కూడా మేం వేరే వాళ్ల కోసం బతకలేం కదా. ఏదో సెల్‌ఫోన్‌లో ఫొటో తీస్తారు. తీరా ఆ ఫొటోలో మేం బాగాలేకపోతే విమర్శిస్తారు.
మీ వయసున్న అమ్మాయిలకు కొన్ని జాగ్రత్తలేమైనా చెబుతారా?
తెలియని ప్రదేశాలకు వెళ్లేటప్పుడు ఒంటరిగా వెళ్లకండి. ఒక గ్రూప్‌గా వెళ్లండి. అపరిచితులను నమ్మకండి. ఎక్కడికి వెళుతున్నారో ఇంట్లో చెప్పి వెళ్లడం బెటర్. ఇది మన సేఫ్టీ కోసం మనం చేయాలి. ఫస్ట్ హ్యాపీగా ఉండండి. వేరే వాళ్లు ఏమనుకుంటారో అని ఆలోచించకుండా మీకు నచ్చినట్టుగా, మీకు తోచినట్లుగా ఉండండి. మీరు కేర్ చేయాల్సింది కేవలం మీ పేరెంట్స్‌నే. ఎందుకంటే వాళ్లే మీకు జన్మనిచ్చింది, కావల్సినవన్నీ ఇచ్చేదివాళ్లే. వాళ్లను బాధపెట్టే పనులు చేయొద్దు.
మలయాళం నుంచి వచ్చిన మిమ్మల్ని తెలుగు అమ్మాయిలానే ట్రీట్ చేయడం ఎలా ఉంది?
చాలా సంతోషంగా ఉంది. తెలుగులో సినిమాలు చేస్తాను అని ఎప్పుడూ అనుకోలేదు. అది కూడా మోహనకృష్ణ ఇంద్రగంటి సినిమాతో లాంచ్ అంటే అంతకు మించి ఇంకేం కోరుకోలేం. నా ఫస్ట్ మూవీ ‘జెంటిల్‌మెన్’ నాకు ఎప్పటికీ స్పెషల్‌గా ఉంటుంది. తెలుగు ఆడియన్స్ చాలా బాగా వెల్‌కమ్ చెప్పారు. వాళ్లకు నా మనసులో స్పెషల్ ప్లేస్ ఇచ్చేశా.
హీరోయిన్స్ అంటే స్లిమ్‌గా ఉండాలంటారు. మీరు కొంచెం బబ్లీగా ఉంటారు. తగ్గాలనుకుంటు న్నారా?
అలా ఎప్పుడూ అనుకోలేదు. నాకెప్పుడూ క్యారెక్టర్స్ ఇంపార్టెంట్. ఒక క్యారెక్టర్ కోసం వెయిట్ లాస్ అవ్వమంటే అవుతాను. పెరగాలంటే పెరుగుతాను. ప్రస్తుతం చేస్తున్న ఓ సినిమాలో కొంచెం స్లిమ్‌గా కనిపించమన్నారు. బరువు తగ్గాను.
మలయాళ సినిమాలు సైన్ చేయలేనంత బిజీ అవుతున్నారు. మదర్ టంగ్‌ని మిస్ అవుతున్నాను అనే ఫీలింగ్ ఉందా?
మాది కేరళ అయినప్పటికీ పుట్టింది, పెరిగింది చెన్నైలోనే. మలయాళం, తమిళం, తెలుగు భాషలు మాట్లాడతాను. మిస్ అవుతున్నానని పించదు. సినిమాకి లాంగ్వేజ్‌తో సంబంధం లేదు.
మీరా జాస్మిన్, మమతా మోహన్‌దాస్, నిత్యామీనన్, నయనతార, సమంత, అనుపమా పరమేశ్వరన్, మీరు.. మలయాళీ గర్ల్స్ హవా ఎప్పటినుంచో ఇక్కడ ఎక్కువ ఉంది. డబ్బింగ్ చెబుతారు, పాటలు కూడా పాడుతున్నారు. ఏంటి స్పెషాలిటీ?
ఏమో. నాకు తెలియదు. మీరన్నట్లు మాకు ఇక్కడ ఎక్కువ అవకాశాలు వస్తున్నాయి. కేరళ కల్చరల్ హబ్. ఏదైనా త్వరగా నేర్చుకోగలం. దేనికైనా అడాప్ట్ అవ్వగలం. హెవీ లిటరేచర్ ఇంపాక్ట్. మాకు ఇక్కడ అవకాశాలు రావడానికి అది ఒక రీజన్ అనుకుంటాను.
ఇది బ్యాగ్‌లో లేకపోతే నేను బయటకు వెళ్లలేను అనిపించే వస్తువులు ఏంటి ?
లిప్ బామ్, గ్లాసెస్, కొంచెం క్యాష్
క్యాష్ మర్చిపోయి తికమకలో పడ్డ సందర్భాలు ఏమైనా ఉన్నాయా?
లేదు. లేదు. ఒక్కదాన్నే వెళ్లేటప్పుడు ఒకటికి రెండు సార్లు చెక్ చేసుకుంటాను. ఫ్రెండ్స్‌తో వెళ్లినప్పుడు మరచిపోయినా నో ప్రాబ్లమ్.
ఖర్చు విషయంలో ఎలా ఉంటారు?
లావిష్‌గా ఖర్చుపెట్టను. కానీ అవసరం ఉందనుకుంటే మాత్రం కచ్చితంగా కొంటాను.
చిన్న వయసులోనే సంపాదన మొదలుపెట్టేశారు. మీ పేరెంట్స్‌కి గిఫ్ట్స్ ఇస్తుంటారా?
అమ్మ కోసం ఓ కార్ కొన్నాను. కట్ చేస్తే అది నీకే అని తిరిగి నాకే జ్రెంట్ చేశారు మా పేరెంట్స్. డాడ్‌కి వాచ్ కొనిచ్చాను. గిఫ్ట్స్ ఇవ్వడం నాకు చాలా ఇంట్రస్ట్. అమ్మానాన్నలకు ఏంటేంటో ఇవ్వాలని ఉంటుంది. అయితే ‘మెటీరియల్’ కన్నా నాకు ఇప్పుడు కావాల్సింది ‘టైమ్’. అమ్మానాన్నలతో ఎక్కువ టైమ్ స్పెండ్ చేయలేకపోతున్నాను. అది కొంచెం బాధగా ఉంటుంది.
ఫైనల్లీ.. ఇంత బిజీగా ఉండటం అదృష్టమే కదా?
నిజంగా అదృష్టమే. మంచి ఫ్యామిలీ దొరకడం, మంచి ఫ్రెండ్స్, నా చుట్టూ ఎప్పుడూ నా మంచి కోరుకునే మనుషులు ఉండటం నిజంగా బ్లెస్సింగ్ అనిపిస్తోంది.
– డి.జి. భవాని
Comments
Please login to add a commentAdd a comment