వార‌ణాసిలో ‘ఇస్మార్ట్‌ శంక‌ర్’ యాక్షన్ | iSmart Shankar Action Episode in Varanasi | Sakshi
Sakshi News home page

వార‌ణాసిలో ‘ఇస్మార్ట్‌ శంక‌ర్’ యాక్షన్

Published Tue, Apr 30 2019 3:16 PM | Last Updated on Sun, Jul 14 2019 10:21 AM

iSmart Shankar Action Episode in Varanasi - Sakshi

ఎన‌ర్జిటిక్ రామ్‌, డాషింగ్ డైరెక్టర్ పూరి జ‌గ‌న్నాథ్ కాంబినేష‌న్‌లో రూపొందుతోన్న చిత్రం ‘ఇస్మార్ట్ శంక‌ర్’. డ‌బుల్ దిమాక్ హైద‌రాబాది అనే ట్యాగ్ లైన్‌తో రూపొందుతున్న ఈ సినిమాలో రామ్‌ డిఫరెంట్‌ లుక్‌లో అలరించనున్నాడు‌. ఈ సినిమా భారీ యాక్షన్ ఎపిసోడ్‌ను బుధవారం నుండి వారణాసిలో చిత్రీక‌రించ‌నున్నారు.

సినిమా కీల‌క ఘ‌ట్టంలో ఈ యాక్షన్ పార్ట్ ఉంటుంది. కాబ‌ట్టి డైరెక్టర్ పూరి జ‌గ‌న్నాథ్ భారీ రేంజ్‌లో ఈ సీక్వెన్స్‌ని తెర‌కెక్కిస్తున్నారు. హైద‌రాబాద్ నుండి సినిమాకు సంబంధించిన న‌టీన‌టులు, సాంకేతిక నిపుణులు వార‌ణాసి వెళుతున్నారు. పూరి స్టయిల్లో రియ‌ల్ స‌తీష్ ఈ యాక్షన్ పార్ట్‌ను తెర‌కెక్కించ‌బోతున్నారు. రామ్‌ తో పాటు హీరోయిన్‌ నిధి అగ‌ర్వాల్‌, ఆశిష్ విద్యార్థి, షాయాజీ షిండే, దీప‌క్ శెట్టి, తుల‌సి త‌దిత‌రులు ఈ షెడ్యూల్‌లో పాల్గొంటున్నారు.

పూరి జ‌గ‌న్నాథ్ టూరింగ్ టాకీస్‌, పూరి క‌నెక్ట్స్ బ్యాన‌ర్స్‌పై ఈ సినిమాను పూరి జ‌గ‌న్నాథ్‌, ఛార్మి నిర్మిస్తున్నారు. రామ్ స‌ర‌స‌న నిధి అగ‌ర్వాల్‌, న‌భా న‌టేష్ హీరోయిన్స్‌గా న‌టిస్తున్నారు. మ‌ణిశ‌ర్మ సంగీతాన్ని అందిస్తున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement