విడాకులు కాదు...గృహప్రవేశం..!
విడాకులు కాదు...గృహప్రవేశం..!
Published Sun, Oct 6 2013 12:43 AM | Last Updated on Wed, Apr 3 2019 6:23 PM
హృతిక్‌రోషన్, ఆయన భార్య సుజానె విడాకులు తీసేసుకోబోతున్నారని దాదాపు రెండు, మూడేళ్లుగా బాలీవుడ్‌లో విపరీతంగా ప్రచారం జరుగుతోంది. ఈ వార్త బయటికొచ్చినప్పుడల్లా ‘మా మధ్య మనస్పర్థలు లేవు’ అని హృతిక్ చెబుతుంటారు. గత వారం, పది రోజులుగా ఈ విడాకుల వార్త ఇంకా జోరుగా షికారు చేస్తోంది. కానీ హృతిక్, సుజానె మాత్రం ఈ పుకారుని పట్టించుకునే స్థితిలో లేరు. ఎందుకంటే, ముంబయ్‌లోని బాంద్రాలో 25 కోట్ల రూపాయలు విలువ చేసే ఫ్లాట్ కొనుక్కున్నారు. ఆరు నెలల క్రితం ఆ ఫ్లాట్‌ని బుక్ చేశారు ఈ దంపతులు.
ఈ ప్రాపర్టీ ఇద్దరి పేరు మీద ఉందట. నాలుగువేల ఐదువందల చదరపు అడుగుల విస్తీర్ణం గల ఆ ఫ్లాట్ చాలా లగ్జరీగా ఉంటుందని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. గత కొన్ని రోజులుగా ఇంటీరియర్ డెకరేషన్ చేయిస్తూ బిజీగా ఉన్నారు
ఈ దంపతులు. ఇక, గృహప్రవేశం అవ్వడమే ఆలస్యం. ఓ మంచి రోజు చూసుకుని, ఈ దంపతులు ఇంట్లో కుడి కాలు పెట్టాలనుకుంటున్నారు.
Advertisement
Advertisement