
నన్ను చూసేందుకు విమానంలో వచ్చింది!
ముంబై: సినిమా షూటింగ్ లతో కూతురు చాలా బిజీగా ఉంది. వరుస షూటింగ్ షెడ్యూల్స్ తో ఊపిరి సలపనంతగా తన కూతురు పనిచేస్తుందని ఆమెను చూసేందుకు విమానంలో కూతురి కోసం లంక నుంచి ముంబైకి వచ్చేసింది. ఆ కూతురు మరెవరో కాదు బాలీవుడ్ హీరోయిన్ జాక్వెలైన్ ఫెర్నాండేజ్. పవిత్ర ఈస్టర్ పర్వదినం కూతురితో కలిసి చేసుకోవాలని జాక్వెలైన్ వాళ్ల అమ్మ భావించింది. అమ్మ తన కోసం రెక్కలు కట్టుకుని వాలిపోయిందని తెగ సంబర పడిపోయింది.
ఈస్టర్ స్పెషల్ అయిన బన్స్ తన కోసం తీసుకొచ్చిందని, చిన్నప్పటి నుంచి పండుగరోజున తింటున్నానని చెప్పుకొచ్చింది. ప్రతి ఏడాది ఈస్టర్ జరుపుకుంటున్నాం, కానీ ఈసారి మా అమ్మ లంక నుంచి తన కోసం వచ్చేసిందని అందుకే చాలా స్పెషల్ అని చెప్పింది. జాక్వెలైన్ ప్రస్తుతం ముంబైలో ఉంటుంది. ఆమె ప్రస్తుతం 'హౌస్ ఫుల్ 3', 'దిషూమ్', 'ఏ ఫ్లైయింట్ జాట్' షెడ్యూల్స్ తో బిజీబిజీగా ఉంటోంది.