
జాక్వెలిన్ ఫెర్నాండజ్
ఈ ఏడాది బాలీవుడ్‌లో అక్షయ్ కుమార్, అభిషేక్ బచ్చన్‌ల తర్వాత డిజిటల్ వరల్డ్‌లోకి అడుగుపెట్టడానికి సిద్ధమయ్యారు జాక్వెలిన్ ఫెర్నాండజ్. డిజిటల్ స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్ నిర్మించబోయే ‘మిసెస్ సీరియల్ కిల్లర్’ సినిమా ద్వారా జాక్వెలిన్ వెబ్ వరల్డ్‌లోకి ఎంట్రీ ఇస్తున్నారు. శిరీష్ కుందర్ దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందనుంది. ‘‘ఓ మర్డర్ కేస్‌లో చిక్కుకున్న భర్తకు కాపాడటం కోసం సీరియల్ కిల్లర్ తరహాలో మరో హత్య చేసి తన భర్తను కాపాడుకున్న భార్య కథే మిసెస్. బుధవారం జాక్వెలిన్ ఫస్ట్ లుక్‌ను రిలీజ్ చేశారు. ‘‘ఎప్పటినుంచో వెబ్ వరల్డ్‌లోకి ఎంట్రీ ఇవ్వాలనుకుంటున్నాను. ఫైనల్‌గా కుదిరింది’’ అని శిరీష్ కుందర్ పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment