
ఐదు రోజుల పాటు బిగ్‌బాస్ హౌస్‌లో ఇంటిసభ్యులు చేసిన గొడవలు, అల్లరిని అందరూ చూశారు. నాగార్జున వస్తాడు అందరి లెక్కతేలుస్తాడు అని ఇంటి సభ్యులు ఎదురుచూసిన శనివారం వచ్చేసింది. అయితే నాగ్ ఎవరికి ఏ రేంజ్‌లో క్లాస్ పీకుతాడో తెలీదు.. ఎందుకంటే ఆయనకు ఇదే మొదటి వారం. మరి ఇంటిసభ్యులను నాగ్ ఎలా దారిలో పెడతాడో చూడాలి. నామినేషన్స్‌ల్లోంచి ఎలిమినేట్ అయిన వారిని తనీష్ స్పెషల్ ఇంటర్వ్యూ చేయనున్నాడని తెలుస్తోంది. ఇంట్లోంచి బయటకు వచ్చిన కంటెస్టెంట్లు మొదట వారి చానెల్‌కే ఇంటర్వ్యూ ఇవ్వాలన్న నిబంధనను చేర్చారని.. తనీష్‌తో ఈ ఇంటర్వ్యూలు చేయించనున్నట్లు తెలుస్తోంది.
మరి మొదటి వారానికి ఎలిమినేషన్ జోన్‌లో ఉన్న రాహుల్ సిప్లిగంజ్, జాఫర్, వితికా షెరు, హిమజ, హేమ, పునర్నవిల్లోంచి ఎవరు బయటకు వెళ్తారో తెలియాలంటే రేపటి వరకు ఆగాల్సిందే. అయితే సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న దాన్ని బట్టి చూస్తే.. జాఫర్, పునర్నవిలు సేఫ్ అని తెలుస్తోంది. ఇక మొదటివారం ఇంట్లోంచి హేమ బయటకు వెళ్లనుందని ప్రచారం జరుగుతోంది. మరి ఇది నిజమో కాదో తెలియాలంటే.. రేపటి వరకు ఆగాల్సిందే.
Comments
Please login to add a commentAdd a comment