
మరోసారి బాలయ్యతో ఢీ
సీనియర్ హీరోల లిస్ట్ లో చిరంజీవి తరువాత వంద సినిమాలకు చేరువవుతున్న ఒకే ఒక్క హీరో నందమూరి బాలకృష్ణ. భారీ ఫాలోయింగ్ తో పాటు అదే స్ధాయిలో కమర్షియల్ హిట్స్ కూడా ఉన్న బాలయ్య ప్రస్తుతం తన 99వ సినిమాలో నటిస్తున్నాడు. శ్రీవాసు దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ ఫ్యామిలీ డ్రామా తరువాత తన 100వ సినిమాను భారీగా తెరకెక్కించే ఆలోచనలో ఉన్నాడు నందమూరి అందగాడు.
బాలకృష్ణ హీరోగా సింహా, లెజెండ్ లాంటి సూపర్ హిట్ సినిమాలను అందించిన బోయపాటి శ్రీను దర్శకత్వంలో 100వ సినిమాకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ప్రస్తుతం అల్లు అర్జున్ హీరోగా సరైనోడు సినిమాను తెరకెక్కిస్తున్న బోయపాటి ఆ సినిమాతో పాటు బాలయ్య వందో సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులను కూడా పూర్తి చేసే పనిలో ఉన్నాడు.
ఈ సినిమాను ఎలాగైన భారీ సక్సెస్ చేయాలని భావిస్తున్న చిత్రయూనిట్ ఎక్కడా కాంప్రమైజ్ కావటం లేదు. అందుకే లెజెండ్ సినిమాలో బాలయ్యకు ప్రతి నాయకుడిగా నటించిన జగపతిబాబును మరోసారి విలన్ గా సెలెక్ట్ చేశారన్న టాక్ వినిపిస్తోంది. లెజెండ్ సినిమాతో భారీ సక్సెస్ కొట్టిన బాలయ్య, జగపతి బాబులు మరోసారి అదే ఫీట్ సాధిస్తారని భావిస్తున్నారు.