వాస్తవ సంఘటనలతో జయహో
‘జగన్’ చిత్రం ద్వారా హీరోగా పరిచయమైన శివ నటిస్తున్న మలి చిత్రం ‘జయహో’ హైదరాబాద్‌లో ప్రారంభమైంది. మహాగణపతి ఫిలింస్ పతాకంపై బాలశేఖరన్ దర్శకత్వంలో యం. సుధాకర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ముహూర్తపు సన్నివేశానికి ఎన్టీ చౌదరి కెమెరా స్విచాన్ చేయగా, డా.దాసరి క్లాప్ ఇచ్చారు. నిర్మాత మాట్లాడుతూ -‘‘ప్రస్తుతం చదువనేది వ్యాపారంగా మారిపోయింది. ఆ అంశాన్ని ప్రధాన ఇతివృత్తంగా తీసుకున్నాం’’ అన్నారు.
‘‘ఇందులో కాలేజ్ స్టూడెంట్‌గా నా పాత్రలో పలు ఎమోషన్స్ ఉంటాయి’’ అని శివ చెప్పారు. దర్శకుడు మాట్లాడుతూ -‘‘ప్రియమైన నీకు, స్నేహమంటే ఇదేరా, అమ్మాయి బాగుందిలాంటి చిత్రాలకు దర్శకత్వం వహించాను. తొమ్మిదేళ్ల విరామం తర్వాత చేస్తున్న సినిమా ఇది. ఆంధ్రా కాలేజ్‌లో జరిగిన ఓ వాస్తవ సంఘటన ఆధారంగా ఈ సినిమా చేస్తున్నాం’’ అన్నారు. మంచి పాత్రలు చేస్తున్నామని సందీప్, ప్రియాంక, అక్షిత, పరిణీతి తెలిపారు.