ఇక్కడ కూడా హిట్! | Jilla Telugu Movie hit | Sakshi
Sakshi News home page

ఇక్కడ కూడా హిట్!

Published Sun, Jul 26 2015 10:57 PM | Last Updated on Sun, Sep 3 2017 6:13 AM

ఇక్కడ కూడా హిట్!

ఇక్కడ కూడా హిట్!

‘‘ ‘జిల్లా’ సినిమాలను తెలుగులో రీమేక్ చేద్దామనుకున్నాం. తమిళంలో విజయ్, మోహన్‌లాల్ చేసిన పాత్రలకు సరైన కాంబినేషన్ సెట్ కాలేదు. దాంతో అనువదించి, విడుదల చేశాం’’ అని నిర్మాత ఆర్.బి చౌదరి అన్నారు. విజయ్, కాజల్ అగర్వాల్ జంటగా మోహన్‌లాల్ ముఖ్యపాత్రలో ఆర్.టి. నేసన్ దర్శకత్వంలో సూపర్‌గుడ్ ఫిలిం సమర్పణలో ప్రసాద్ సన్నితి, తమటం కుమార్‌రెడ్డి తెలుగు ప్రేక్షకులకు అందించిన చిత్రం ‘జిల్లా’. హైదరాబాద్‌లో జరిగిన ఈ చిత్రం సక్సెస్ మీట్‌లో ఆర్.బి.చౌదరి మాట్లాడుతూ -‘‘మంచి యాక్షన్ ఓరియెంటెడ్ కథ కావడంతో సినిమాను ప్రేక్షకులు బాగా ఆదరిస్తున్నారు. విజయ్, మోహన్‌లాల్ కాంబినేషన్ ఈ చిత్రానికి హైలైట్’’ అని అన్నారు. ‘‘తమిళంలోలా తెలుగులో కూడా విజయం సాధించినందుకు చాలా ఆనందంగా ఉంది’’ అని దర్శకుడు అన్నారు. ఈ వేడుకలో తమటం కుమార్ రెడ్డి, ప్రసాద్ సన్నితి తదితర చిత్ర బృందం పాల్గొన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement