
జానీ డెప్ప్
జానీ డెప్ప్ అనగానే గుర్తుకురాకపోయినా కెప్టెన్ జాక్ స్పారో అనగానే వెంటనే మనందరి ముందు సముద్రపు తీరంలో సాహసాలు చేసే జానీ డెప్ప్ గుర్తుకురాక మానరు. కెప్టెన్ జాక్ స్పారో పాత్ర ద్వారా చాలా పాపులర్ అయ్యారు హాలీవుడ్ నటుడు జానీ డెప్ప్. సముద్రపు దొంగల బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కిన ‘పైరేట్స్ ఆఫ్ ది కరీబియన్’ సీరిస్‌లోని ఐదు సినిమాలో జానీ డెప్ప్ ముఖ్య పాత్ర పోషించారు. అయితే తాజాగా ఈ సిరీస్‌లో రానున్న కొత్త చిత్రంలో మెయిన్ లీడ్‌గా డెప్ప్ నటించకపోవచ్చునని నిర్మాణ సంస్థ పేర్కొంది. ‘‘పైరేట్స్ ..’ సిరీస్‌ను సరికొత్తగా ఆవిష్కరించే పనిలో భాగంగా ఈ సినిమాలో లీడ్‌ను మార్చాలనుకుంటున్నాం. జాక్ స్పారో అనగానే డెప్ప్ గుర్తుకు వస్తారు. 15 ఏళ్ల ఈ సిరీస్‌లో కలసి ప్రయాణించాడు. ఆనందంగా ఉంది’’ అని సంస్థ పేర్కొంది. మరి కొత్త కెప్టెన్‌గా ఎవరు పగ్గాలు చేపడతారో వేచి చూడాలి.
Comments
Please login to add a commentAdd a comment