Pirates of the Caribbean
-
సొరచేప వల్ల ప్రాణాలు కోల్పోయిన ప్రముఖ నటుడు
హాలీవుడ్ హిట్ సినిమా 'పైరేట్స్ ఆఫ్ ద కరీబియన్' మూవీ గురించి చాలామందికి తెలిసే ఉంటుంది. ఇందులో నటించిన తమయో పెర్రీ (49) అనే నటుడు ఓ మాదిరి గుర్తింపు తెచ్చుకున్నాడు. దీనితో పాటు పలు చిత్రాల్లోనూ కీలక పాత్రలు పోషించాడు. ఇప్పుడు ఇతడు ఊహించని విధంగా షార్క్ చేప దాడిలో మరణించాడు. హువాయి బీచ్‌లో సర్ఫింగ్ చేస్తుండగా, ఈ సంఘటన చోటు చేసుకుంది.(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లో 21 సినిమాలు రిలీజ్.. అవి ఏంటంటే?)స్వతహాగా నటుడు అయినప్పటికీ తమయో పెర్రీ.. గతంలో ఓషన్ సేఫ్టీ డిపార్ట్మెంట్లో పనిచేశాడు. లైఫ్ గార్డ్‌గానూ విధులు నిర్వర్తించాడు. అలానే సర్ఫింగ్లోనూ మంచి ఎక్స్పెర్ట్. కానీ హవాయి బీచ్‌లో అదే సర్ఫింగ్ చేస్తుండగా ఇతడిపై సొరచేప దాడి చేసింది. దీన్ని గమనించిన ఓ వ్యక్తి, అధికారులకు సమాచారం ఇవ్వగా ఇతడిని ఒడ్డుకు తీసుకొచ్చారు. కానీ అప్పటికే గాయాలు తీవ్రంగా ఉండేసరికి ప్రాణాలు వదిలేశాడు.(ఇదీ చదవండి: స్టార్ హీరో జయం రవి విడాకుల రూమర్స్.. హింట్ ఇచ్చిన భార్య?) -
జానీ డెప్‌కు క్షమాపణ కోరుతూ రూ.2355 కోట్లు ఆఫర్!
'పైరేట్స్ ఆఫ్ కరేబియన్' సినిమాతో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నాడు హాలీవుడ్ స్టార్ జానీ డెప్. కెరీర్ సజావుగా సాగుతుందనుకున్న సమయంలో అతడి భార్య అంబర్ హెరాల్డ్‌తో విబేధాలు రావడం, విడాకులు తీసుకోవడం, ఆ తర్వాత జుగుప్సాకర రీతిలో ఆరోపణలు చేసుకుంటూ కోర్టుకెక్కిన విషయం తెలిసిందే. ఈ కేసులో చివరాఖరకు జానీ విజయం సాధించాడు. అయితే అంబర్ ఆరోపణలు చేసిన సమయంలో హాలీవుడ్‌లోని డిస్నీ వంటి బడా నిర్మాణ సంస్థలు జానీతో సినిమా చేసేందుకు నిరాకరించాయి. ఇప్పుడు అతడు కోర్టులో నిర్దోషి అని నిరూపితమవడంతో తిరిగి జానీతో కలిసి పని చేసేందుకు సమాయత్తమవుతున్నాయి. అయితే దానికంటే ముందు డిస్నీ అతడికి క్షమాపణ కోరుతూ లేఖ పంపించినట్లు తెలుస్తోంది. అంతేకాదు, కరేబియన్ ఫ్రాంచైజీలో నటించాలంటూ రూ.2,355 కోట్లు(301 మిలియన్ డాలర్స్) ఆఫర్ చేసినట్లు సమాచారం. కాగా కరేబియన్ ఆఫ్ పైరేట్స్లోని ఐదు భాగాల్లో జాక్ స్పారోగా జానీనే నటించాడు. మరి జానీ వారిని క్షమిస్తాడా? నెక్స్ట్ పార్ట్‌లో అతడు ఉన్నాడా? లేదా? అనేది తెలియాలంటే కొంతకాలం ఆగాల్సిందే! జానీ- అంబర్ కేసు విషయానికి వస్తే.. 2015లో జానీ డెప్, అంబర్‌హర్డ్‌ల వివాహం జరిగింది. కానీ, ఏడాదికే మనస్పర్థలు రావడంతో 2017లో అధికారికంగా విడాకులు తీసుకున్నారు. ఆ తర్వాత ఇద్దరూ ఒకరి మీద తీవ్ర ఆరోపణలు చేసుకున్నారు. 2018లో అంబర్ సెక్సువల్ వయొలెన్స్ ఆర్టికల్ రాయగా.. అది తన పరువుకు భంగం కలిగించేలా ఉందంటూ 2019 ఫిబ్రవరిలో జానీ కోర్టుకెక్కాడు ఇందుకుగానూ 50 మిలియన్ డాలర్ల నష్టపరిహారం చెల్లించాలని కోరాడు. ప్రతిగా 2020 ఆగస్టులో తానూ గృహ హింసను ఎదుర్కొన్నానంటూ అంబర్ హెరాల్డ్ 100 మిలియన్ డాలర్లకు కౌంటర్ దావా వేసింది. ఈ దావాల్లో ఇరు పక్షాల వాదనలు విన్న న్యాయస్థానం జానీకి అనుకూలంగా తీర్పునిచ్చింది. చదవండి: ఒకేసారి రిపీట్ కానున్న 10 జంటలు.. ప్రేమ వివాహానికి రెడీ అవుతున్న హీరో రామ్, త్వరలో ప్రకటన?! -
క్రిప్టోలు ‘సముద్ర దొంగల ప్రపంచమే’!
న్యూఢిల్లీ: క్రిప్టో కరెన్సీలపై కేంద్ర ప్రభుత్వ ముఖ్య ఆర్థిక సలహాదారు వి. అనంతనాగేశ్వరన్ కీలక వ్యాఖ్యలు చేశారు. క్రిప్టోలపై నియంత్రణల లోపిస్తే లేదా కేంద్రీకృత నియంత్రణ యంత్రాంగం లేకపోతే అది కరీబియన్ సముద్రపు దొంగల ప్రపంచం మాదిరే తయారయ్యే ప్రమాదం ఉంటుందన్నారు. ప్రభుత్వం గడిచిన నాలుగు సంవత్సరాల్లో వృద్ధి, ద్రవ్యోల్బణం, రూపాయి స్థిరత్వం పరంగా వచ్చిన లాభాలు దెబ్బతినకుండా ఎంతో తటస్థంగా వ్యవహరిస్తున్నట్టు చెప్పారు. గత నెలలో టెర్రా–లూనా క్రిప్టోకరెన్సీ భారీ పతనం గురించి ప్రస్తావిస్తూ.. ఇది ఎంతో ముఖ్యమైన హెచ్చరికగా పేర్కొన్నారు. ‘‘క్రిప్టో కరెన్సీలను చూసి నేను ఉద్వేగం చెందను. ఎందుకంటే కొన్ని సందర్భాల్లో బలీయమైన శక్తుల ప్రభావాన్ని మనం తెలుసుకోలేకపోవచ్చు. అందుకే నేను ఫిన్‌టెక్ ఆధారిత ఈ తరహా ఆవిష్కరణలైన డీసెంట్రలైజ్డ్ ఫైనాన్స్ (డెఫి), క్రిప్టోలను ఆహ్వానించే విషయంలో రక్షణాత్మకంగా వ్యవహరించాను. ఈ విషయంలో నేను ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్ టి రవిశంకర్ అభిప్రాయాలతో ఏకీభవిస్తున్నాను. ప్రస్తుతానికి క్రిప్టో కరెన్సీలు, డెఫీలను అచ్చమైన ఫైనాన్షియల్ ఆవిష్కరణలుగా చూడడం కంటే.. నియంత్రణపరమైన మధ్యవర్తిత్వం అవసరమని రవిశంకర్ చెప్పారు. అవి మరింత వికేంద్రీకృతమైతే, నియంత్రణ లేకపోతే.. అది కరీబియన్ సముద్రపు దొంగల ప్రపంచం లేదా అందరి దగ్గర ఉన్నవి ఎవరో ఒకరు లాగేసుకునే ప్రపంచంగా మారిపోవచ్చు’’అని నాగేశ్వరన్ క్రిప్టోలపై తన అభిప్రాయాలను, నియంత్రణ అవసరాన్ని తెలియజేశారు. క్రిప్టోలను చట్టబద్ధం చేయవద్దని ఆర్బీఐ కేంద్రానికి బలంగా సూచించడం తెలిసిందే. దీంతో క్రిప్టో లాభాలపై పన్ను విధిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. ఆర్బీఐ సొంతంగా డిజిటల్ రూపీని ఆవిష్కరించే కార్యక్రమంలో ఉండడం తెలిసిందే. చదవండి: Bloodbath In Crypto Markets: మార్కెట్ క్యాప్ ఢమాల్! -
జాక్ స్పారోకు గుడ్ బై..!
హాలీవుడ్లో ఘనవిజయం సాదించిన సూపర్ హిట్ సిరీస్‌లలో ది పైరేట్స్ ఆఫ్ ది కరేబియన్ ఒకటి. ఇప్పటికే ఐదు భాగాలుగా రిలీజ్ అయినా ఈ సిరీస్‌లో ఆరోభాగం త్వరలో ప్రారంభం కానుంది. అయితే ఈ భాగంలో ప్రధాన పాత్ర అయిన జాక్‌స్పారో పాత్రదారి మారనున్నాడట. గత ఐదు భాగాల్లో జాక్ స్పార్ పాత్రను పోషించిన హాలీవుడ్ సూపర్ స్టార్ జానీ డెప్ ఇక మీదట ఆ పాత్రలో కనిపించడని తెలుస్తోంది. కారణాలను అధికారికంగా ప్రకటించకపోయినా జానీ డెప్‌ను పైరేట్స్ ఆఫ్ ది కరేబియన్ సిరీస్‌ను తొలగించిన విషయాన్ని చిత్ర నిర్మాతలు అధికారికంగా వెల్లడించారు. గత పద్నాల్లుగే సినీ ప్రేక్షకులను కెప్టెన్ జాక్ స్పారోగా అలరిస్తున్నాడు డెప్. త్వరలో ప్రారంభంకానున్న సిరీస్ లో ఆ పాత్రలో ఎవరు నటిస్తారన్న విషయంపై చర్చ జరుగుతోంది. -
పడవలోంచి దింపేశారు!
జానీ డెప్ప్ అనగానే గుర్తుకురాకపోయినా కెప్టెన్ జాక్ స్పారో అనగానే వెంటనే మనందరి ముందు సముద్రపు తీరంలో సాహసాలు చేసే జానీ డెప్ప్ గుర్తుకురాక మానరు. కెప్టెన్ జాక్ స్పారో పాత్ర ద్వారా చాలా పాపులర్ అయ్యారు హాలీవుడ్ నటుడు జానీ డెప్ప్. సముద్రపు దొంగల బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కిన ‘పైరేట్స్ ఆఫ్ ది కరీబియన్’ సీరిస్‌లోని ఐదు సినిమాలో జానీ డెప్ప్ ముఖ్య పాత్ర పోషించారు. అయితే తాజాగా ఈ సిరీస్‌లో రానున్న కొత్త చిత్రంలో మెయిన్ లీడ్‌గా డెప్ప్ నటించకపోవచ్చునని నిర్మాణ సంస్థ పేర్కొంది. ‘‘పైరేట్స్ ..’ సిరీస్‌ను సరికొత్తగా ఆవిష్కరించే పనిలో భాగంగా ఈ సినిమాలో లీడ్‌ను మార్చాలనుకుంటున్నాం. జాక్ స్పారో అనగానే డెప్ప్ గుర్తుకు వస్తారు. 15 ఏళ్ల ఈ సిరీస్‌లో కలసి ప్రయాణించాడు. ఆనందంగా ఉంది’’ అని సంస్థ పేర్కొంది. మరి కొత్త కెప్టెన్‌గా ఎవరు పగ్గాలు చేపడతారో వేచి చూడాలి. -
కెప్టెన్ జాక్ స్పారోను చంపేస్తారట!
లాస్ ఏంజిలెస్: కెప్టెన్ జాక్ స్పారో.. పైరేట్స్ ఆఫ్ ది కరేబియన్ సీరిస్ సినిమాల్లో పిల్లాపెద్దలను ఎంతగానో అలరించిన పాత్ర. అయితే ఇకపై ఈ సీరిస్‌లో వచ్చే సినిమాల్లో జాక్ స్పారో కనిపించడట. ఎందుకంటే ఆయన పాత్రను చంపేస్తామని నిర్మాణ సంస్థ డీస్నీ తాజాగా ప్రకటించింది. ‘డెడ్ మ్యాన్ టెల్స్ నో టేల్స్’ పేరుతో ఇటీవల విడుదలైన సినిమా అంతగా ప్రేక్షకాదరణ పొందకపోవడానికి కారణం కూడా జాక్ స్పారో క్యారెక్టర్లో నటించిన జానీ డెప్ కారణమని నిర్మాణ సంస్థ భావిస్తోందని, అందుకే ఆయనను ఇకపై వచ్చే సినిమాల్లో పక్కనబెట్టాలని నిర్ణయించే ఆ పాత్రను చంపేయాలనుకుంటున్నారని స్థానిక వెబ్సైట్ వెల్లడించింది. నిజానికి ఇప్పటిదాకా విడుదలైన సినిమాల్లో జానీ డెప్ పాత్రే ప్రధాన ఆకర్షణ అయినప్పటికీ యువత ఇంకా అతణ్నే చూడాలని కోరుకోవడం లేదని, కాయా స్కోడాల్రియో, బ్రెన్టన్ థ్వైట్స్ వంటి కొత్త నటులను చూసేందుకే ఆసక్తి చూపుతున్నారనే విషయం తాజా సర్వేల్లో తేలిందట. అందుకే ఇకపై జాక్ స్పారో పాత్రను చంపేసి, దాని స్థానంలో కొత్త పాత్రను సృష్టించేందుకు డిస్నీ సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. -
సినిమానే హ్యాక్ చేశారు
లాస్ఏంజెల్స్: రాన్సమ్వేర్ హ్యాకర్లు మరోసారి రెచ్చిపోయారు. గత రెండు రోజులుగా ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న రామ్సన్వేర్ హ్యాకర్లు ప్రముఖ హాలీవుడ్ చిత్రం పైరేట్స్ ఆఫ్ కరేబియన్ సినిమా వీడియోని తస్కరించారు. వాల్ట్‌డిస్నీ ప్రతిష్టాత్మకంగా చిత్రాన్ని నిర్మించింది. సినిమా ఆన్లైన్లో విడుదల కాకుండా ఉండటానికి హ్యాకర్లు భారీ మొత్తాన్ని డిమాండ్ చేస్తున్నారు. లేకపోతే సినిమాను ఆన్లైన్లో ఉంచుతామని బెదిరిస్తున్నారు. అయితే స్టూడియో సీఈవో బాబ్ ఐగర్ అంత మొత్తాన్ని చెల్లించడానికి నిరాకరించాడు. హ్యాకర్లు మొదట 5నిమిశాల చిత్రాన్ని విడుదల చేస్తామన్నారని, అడిగినంత మొత్తంలో చెల్లించకపోతే 20 నిమశాల వీడియోని రిలీజ్ చేస్తామని బెదిరించినట్లు తెలిపారు. పైరేట్స్ ఆఫ్ కరేబియన్ సిరీస్‌లో ఐదో భాగం "డెడ్‌మెన్ టెల్ నో టేల్స్" పేరుతో నిర్మించారు. జాన్‌డెప్ ప్రధాన పాత్ర పోషించిన ఈచిత్రం ఈనెల 25న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కావాల్సి ఉంది.