
హాలీవుడ్ హిట్ సినిమా 'పైరేట్స్ ఆఫ్ ద కరీబియన్' మూవీ గురించి చాలామందికి తెలిసే ఉంటుంది. ఇందులో నటించిన తమయో పెర్రీ (49) అనే నటుడు ఓ మాదిరి గుర్తింపు తెచ్చుకున్నాడు. దీనితో పాటు పలు చిత్రాల్లోనూ కీలక పాత్రలు పోషించాడు. ఇప్పుడు ఇతడు ఊహించని విధంగా షార్క్ చేప దాడిలో మరణించాడు. హువాయి బీచ్‌లో సర్ఫింగ్ చేస్తుండగా, ఈ సంఘటన చోటు చేసుకుంది.
(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లో 21 సినిమాలు రిలీజ్.. అవి ఏంటంటే?)
స్వతహాగా నటుడు అయినప్పటికీ తమయో పెర్రీ.. గతంలో ఓషన్ సేఫ్టీ డిపార్ట్‌మెంట్‍లో పనిచేశాడు. లైఫ్ గార్డ్‌గానూ విధులు నిర్వర్తించాడు. అలానే సర్ఫింగ్‌లోనూ మంచి ఎక్స్‌పెర్ట్. కానీ హవాయి బీచ్‌లో అదే సర్ఫింగ్ చేస్తుండగా ఇతడిపై సొరచేప దాడి చేసింది. దీన్ని గమనించిన ఓ వ్యక్తి, అధికారులకు సమాచారం ఇవ్వగా ఇతడిని ఒడ్డుకు తీసుకొచ్చారు. కానీ అప్పటికే గాయాలు తీవ్రంగా ఉండేసరికి ప్రాణాలు వదిలేశాడు.
(ఇదీ చదవండి: స్టార్ హీరో జయం రవి విడాకుల రూమర్స్.. హింట్ ఇచ్చిన భార్య?)
Comments
Please login to add a commentAdd a comment