‘అజ్ఞాతవాసి’పై స్పందించిన ఎన్టీఆర్‌ | Jr Ntr About Trivikram Pawan Kalyan Agnyaathavaasi Result | Sakshi
Sakshi News home page

Published Sat, Oct 6 2018 1:18 PM | Last Updated on Sat, Oct 6 2018 1:18 PM

Jr Ntr About Trivikram Pawan Kalyan Agnyaathavaasi Result - Sakshi

అజ్ఞాతవాసి లాంటి భారీ డిజాస్టర్‌ తరువాత మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ అరవింద సమేత వీర రాఘవ సినిమా తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. యంగ్ టైగర్‌ ఎన్టీఆర్‌ హీరోగా ఫ్యాక్షన్ బ్యాక్‌ డ్రాప్‌లోతెరకెక్కుతున్న ఈ సినిమాలో పూజా హెగ్డే హీరోయిన్‌గా నటిస్తున్నారు. అక్టోబర్‌ 11న రిలీజ్‌ అవుతున్న ఈ సినిమా ప్రమోషన్‌ కార్యక్రమాల వేగం పెం‍చారు చిత్రయూనిట్.

తాజాగా ప్రమోషన్‌లో భాగంగా మీడియాతో మాట్లాడిన ఎన్టీఆర్‌, త్రివిక్రమ్‌ గత చిత్రం అజ్ఞాతవాసిపై స్పందించాడు. ‘అజ్ఞాతవాసి ప్రభావం అరవింద సమేతపై ఉంటుందని నేను భావించటం లేదు. ప్రతీ సినిమా ఓ సరికొత్త ప్రయాణం. నా కెరీర్‌లో కూడా ఫ్లాప్స్‌ వచ్చాయి. ఒక ఫ్లాప్‌ ప్రభావం ఆ తదుపరి చిత్రం మీద ఉంటుందని నేను నమ్మను. అరవింద సమేత పూర్తిగా త్రివిక్రమ్‌ మార్క్‌ సినిమా’ అన్నాడు ఎన్టీఆర్‌.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement