
వెండితెరపై జూనియర్ మీనా!
మీనా తన చిన్నప్పుడు బోల్డన్ని సినిమాల్లో నటించారు. బాలతారగా ఆమె అప్పట్లో చాలా పాపులర్. కథానాయికగా కూడా మీనా ఓ వెలుగు వెలిగిన విషయం తెలిసిందే. ఇప్పుడు మీనా కూతురు కూడా బాలనటిగా తెరపై మెరిసే అవకాశం ఉందని చెన్నయ్ టాక్.
విజయ్ హీరోగా అట్లీ దర్శకత్వంలో ఓ చిత్రం రూపొందనుంది. ఇందులో విజయ్ కూతురి పాత్రకు నైనికాని అడిగారట.
మీనా కూడా తన కూతుర్ని నటింపజేయడానికి సుముఖంగా ఉన్నట్లు సమాచారం. అప్పట్లో బేబీ మీనా భలే ముద్దుగా ఉండేది. నైనికా కూడా భలే ముద్దుగా ఉంది కదూ.