ఎన్టీఆర్
ఎన్టీఆర్ ఇంట్లో సందడి నెలకొంది. ఇక మీదట ఇంట్లో మరో లిటిల్ టైగర్ సందడి చేయనున్నారు. గురువారం ఎన్టీఆర్ భార్య లక్ష్మీ ప్రణతి బాబుకి జన్మనిచ్చారు. ఆ విషయాన్ని ట్వీటర్‌లో ‘‘కుటుంబం కొంచెం పెద్దదైంది. అబ్బాయి పుట్టాడు’’ అంటూ ఎన్టీఆర్ తన ఆనందాన్ని పంచుకున్నారు. ఆల్రెడీ ఈ దంపతులకు ఓ కుమారుడు (అభయ్) ఉన్న విషయం తెలిసిందే.
ఇన్‌స్టాలో అదే ఫస్ట్ ఫొటో?
ఫొటో షేరింగ్ యాప్ ఇన్‌స్టాగ్రామ్‌లోకి బుధవారం అఫీషియల్‌గా ఎంట్రీ ఇచ్చారు ఎన్టీఆర్. మొదటి పోస్ట్‌గా తన లేటెస్ట్ సినిమా ‘అరవింద సమేత వీర రాఘవ’ ఫొటోను అప్‌లోడ్ చేసినప్పటికీ కొద్దిసేపటికే దాన్ని తీసేశారు. అభిమానులకు సర్‌ప్రైజ్‌గా తన రెండో కుమారుణ్ని పరిచయం చేసే పోస్ట్‌గా ఈ ఫస్ట్ ఫొటోను అప్‌లోడ్ చేస్తారని సమాచారం.
బుజ్జాయి కోసం బ్రేక్?
యాక్చువల్లీ సెకండ్ బేబీ కోసం ఎన్టీఆర్ తన షెడ్యూల్‌ని మార్చుకున్నారట. బాబు పుట్టాక కొన్ని రోజుల పాటు షూటింగ్స్‌కు బ్రేక్ ఇచ్చి ఎక్కువ సమయాన్ని బాబుతోనే గడపాలనుకున్నారని సమా చారం. పొల్లాచ్చిలో జరగనున్న ‘అరవింద సమేత..’ చిత్రానికి ఓ పదిహేను ఇరవై రోజులు గ్యాప్ ఇచ్చి, ఆ తర్వాత షూట్‌లో జాయిన్ కావాలని భావిస్తున్నారట ఎన్టీఆర్.
Comments
Please login to add a commentAdd a comment