ఆరంభమే అదుర్స్ | Kabali: The new poster of Rajinikanth's film is mind-blowing | Sakshi
Sakshi News home page

ఆరంభమే అదుర్స్

Published Mon, Mar 28 2016 4:33 AM | Last Updated on Thu, Jul 26 2018 5:23 PM

ఆరంభమే అదుర్స్ - Sakshi

ఆరంభమే అదుర్స్

 బాషా చిత్రంలో ఒక పాటలో రజనీకాంత్‌ను నటి నగ్మా స్టయిల్, స్టయిల్ దా నీ సూపర్‌స్టయిల్ దా అంటూ పాడుతూ తెగ మోహించేస్తుంది. నిజంగానే మన సూపర్‌స్టార్ స్టయిల్ కింగ్. ఆరంభం నుంచి స్టయిలే ఆయన స్టెంత్. విలన్‌గా నటించినప్పుడే సిగరెట్‌ను తనకే సొంతమైన స్టైల్‌తో గాలిలోకి ఎగరేసి నోటితో పట్టి తాగే నటన యువతను విపరీతంగా ఆకర్షించింది. తల జుత్తును ఆలవోకగా పైకి లేపడం వంటి వివిధ రకాల స్టయిలిష్ నటన అలరిస్తూ హీరో అయిన తరువాత కూడా తన పంథాను మరింత విస్తరించుకుంటూ సూపర్ స్టార్ అంతస్తును పొందిన అరుదైన నటుడు రజనీకాంత్.ఇక పంచ్ డైలాగ్స్ పేల్చడంలోనూ తన స్టయిలే వేరు.

ఆయన స్టయిల్‌ను కొందరు కాపీ కొట్టే ప్రయత్నం చేసినా సాధ్యం కాలేదు. తాజా చిత్రం కబాలిలోనూ రజనీకాంత్ తన స్టయిల్‌ను కొనసాగించారట. ఇందులో పంచ్ డైలాగ్స్ ఉండవని దర్శకుడు రంజిత్ ముందుగానే వెల్లడించినా రకరకాల స్టయిల్స్ మాత్రం ఆయన అభిమానుల్ని యమ ఖుషీ చేస్తాయట. కబాలి చిత్ర ఆరంభంలోనే పెద్ద దాదాగా నటిస్తున్న రజనీకాంత్ ఫుల్ సూట్‌లో కూలింగ్ అద్దాలతో స్టయిలిస్‌గా ఎంటరయ్యే సన్నివేశం అదుర్స్ అనేలా అభిమానుల ఈలలు,చప్పట్లతో దద్దరిల్లుతుందంటున్నారు యూనిట్ వర్గాలు.

 స్టార్.. స్టార్.. సూపర్‌స్టార్
చిన్న విలన్‌గా నట కేరీర్‌ను ప్రారంభించి అంచెలంచెలుగా ఎదుగుతూ స్టార్ ఇమేజ్‌ను ఆ తరువాత సూపర్‌స్టార్ పట్టాన్ని సొంతం చేసుకున్న రజనీకాంత్ నాలుగు దశాబ్దాలుగా ఎవర్‌గ్రీన్‌గా వెలుగొందుతున్నారు.అయితే గత కొద్ది కాలంగా ఆయన సూపర్‌స్టార్ బిరుదును దక్కించుకోకవడానికి కొందరు యువ నటులు విశ్వప్రయత్నం చేస్తున్నారు. మరి కొందరైతే 40 ఏళ్ల పైబడిన వారే రజనీకాంత్ అభిమానులుగా ఉన్నారు. ఆయనకిప్పుడు యూత్ ఫాలోయింగ్ తగ్గింది. అందువల్ల సోషల్ మీడియాలో అధిక సంఖ్యలో అభిమానులు లేరు అనే ప్రచారం చేస్తున్నారు.అయితే అవన్నీ అపోహలేనని శనివారం విడుదలైన కబాలి పోస్టర్ రుజువు చేసింది.

రజనీ ఫొటోతో కూడిన కబాలి పోస్టర్ ఇప్పుడు ట్విట్టర్లలోనూ, ఫేస్‌బుక్‌లలోనూ హల్‌చల్ చేస్తూ ఆయన అభిమానుల్లో ఆనందాన్ని నింపుతోంది. అంతే కాదు ఇప్పుడే కాదు ఎప్పటికీ సూపర్‌స్టార్ రజనీ నేననేలా ఆయన ఫాలోయింగ్ నిరూపణ అయ్యింది.విడుదలకు ముందే ప్రకంపనలు సృష్టిస్తున్న కబాలి మే చివరి వారంలోగానీ జూన్ తొలివారంలో గానీ తెరపై ప్రభంజనం సృష్టించడానికి సిద్ధమవుతోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement