కమల్‌తో ముద్దుకు సై | Kajal agarwal agree for lip-lock with kamal hassan | Sakshi
Sakshi News home page

కమల్‌తో ముద్దుకు సై

Published Thu, Oct 31 2013 12:56 AM | Last Updated on Tue, Oct 30 2018 5:58 PM

Kajal agarwal agree for lip-lock with kamal hassan

మహానటుడు కమల్‌హాసన్ సరసన నటించాలని కథానాయికలందరూ ఉవ్విళ్లూరుతూ ఉంటారు. కానీ కాజల్ మాత్రం అంతటి అవకాశాన్ని కూడా తృణప్రాయంగా వదులుకుంది. డేట్స్ సర్దుబాటు చేయలేకే ఆ అవకాశాన్ని చేజార్చుకున్నానని కాజల్ వివరణ ఇచ్చుకున్నారు కూడా. అయితే... ఉన్నట్లుండి డైరీ ఖాళీ అయ్యిందో ఏమో... కమల్ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు కాజల్. నటుడు రమేష్ అరవింద్ దర్శకత్వంలో రూపొందనున్న ఈ చిత్రానికి ‘ఉత్తమ విలన్’ అనే టైటిల్ కూడా ఖరారు చేశారు. 
 
తిరుపతి బ్రదర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో రొమాంటిక్ సన్నివేశాలకు కొదవే లేదని సమాచారం. ఈ మధ్య ఎక్కువగా సీరియస్ పాత్రలే చేసిన కమల్‌ని కాస్తంత కొత్తగా రొమాంటిక్ యాంగిల్‌లో చూపించాలని తమిళ రచయిత క్రేజీ మోహన్ ఓ అద్భుతమైన కథను ఈ సినిమాకోసం తయారు చేశారట. కథ రీత్యా ఇందులో అధర చుంబనాలు కూడా ఉన్నాయని సమాచారం. వాటికి కూడా కాజల్ ‘సై’ అనేశారట. మరి రేపు దక్షిణాదిన ఈ సినిమా ఎన్ని సంచల నాలకు కేంద్రబిందువు కానుందో  వేచిచూడాలి.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement