
కాజల్ అగర్వాల్
తమిళసినిమా: నేనూ ప్రేమలో పడ్డానంటోంది నటి కాజల్‌అగర్వాల్. హీరోయిన్లు లవ్‌లో పడడం సహజమే. అదీ కాజల్‌అగర్వాల్ లాంటి అందాల రాశి ప్రేమలో పడడంలో ఆశ్చర్యమేముంటుంది. అయితే కొంచెం అలాంటి సంఘటన జరిగింది. ప్రస్తుతం అగ్ర కథానాయకిగా రాణిస్తున్న నటీమణుల్లో ఈ సుందరి ఒకరు. కోలీవుడ్, టాలీవుడ్, బాలీవుడ్ అంటూ చుట్టేస్తున్న కాజల్ అగర్వాల్ గురించి వదంతులు చాలానే ప్రచారంలో ఉన్నాయి. మరో విషయం ఏమిటంటే ఈ అమ్మడి చెల్లెలు నిషా అగర్వాల్ ఇప్పటికే పెళ్లి చేసుకుని ఒక బిడ్డకు తల్లి కూడా అయ్యింది. కాజల్‌కు మాత్రం ఇంకా ఆ గడియలు రాలేదు. కాగా ఇటీవల శ్రియ లాంటి సహ నటీమణులు ప్రేమపెళ్లిళ్లు చేసుకుంటున్నారు. మరి మీ పెళ్లి ఎప్పుడు? ఎవరినైనా ప్రేమిస్తున్నారా? అని ఇటీవల ఒక ఇంటర్వ్యూలో కాజల్‌అగర్వాల్‌ను ప్రశ్నించగా నిజం చెప్పాలంటే తానెప్పుడో ప్రేమలో పడ్డాను అని షాక్ ఇచ్చింది.
ఎవరా లవర్? ఏమా ప్రేమ కథ. కాస్తంత చెప్పరాదూ అన్న ప్రశ్నకు ఈ బ్యూటీ సమాధానమిస్తూ.. ఆగండాగండి నేను ప్రేమలో పడ్డాను కానీ, అది ఒన్‌సైడ్ లవ్‌గానే ముగిసిపోయింది. అలా నేను విపరీతంగా ప్రేమించింది ఎవరినో కాదు. క్రికెట్ క్రీడాకారుడు రోహిత్‌శర్మని. నాకు క్రికెట్ అంటే ఇష్టం. ఇక రోహిత్‌శర్మ క్రికెట్ ఆడే తీరు ఇంకా ఇష్టం. ఆయన బ్యాటింగ్ స్టైల్, ఫీల్డింగ్ ఎనర్జీ నచ్చుతాయి. అందుకే రోహిత్‌శర్మను ఏకపక్షంగా ప్రేమించేశాను అని చెప్పింది. కాగా రోహిత్‌శర్మతో ఒన్‌సైడ్ లవ్ వర్కౌట్ కాకపోయినా, ఇప్పుడు బోత్ సైడ్ బాగానే సాగుతోందంటోంది కాజల్. అయితే ఆ లవ్ విషయం మాత్రం బయట పెట్టడంలేదని సినీ వర్గాలు చెవులు కొరుక్కుంటున్నారు. కాజల్ అగర్వాల్ మాత్రం ఆ టైమ్ వచ్చినప్పుడు పెళ్లి జరుగుతుందనే వేదాంతాన్ని వల్లివేస్తోంది. ప్రస్తుతం తమిళం, తెలుగు చిత్రాలతో బిజీగా ఉంది.
Comments
Please login to add a commentAdd a comment