సమస్యలకు సెల్యూట్‌! | kajal agarwal completed ten years in industry | Sakshi
Sakshi News home page

సమస్యలకు సెల్యూట్‌!

Published Thu, Feb 16 2017 10:57 PM | Last Updated on Tue, Oct 30 2018 5:58 PM

సమస్యలకు సెల్యూట్‌! - Sakshi

సమస్యలకు సెల్యూట్‌!

జీవితంలో సమస్యలు, సంతోషాలు సహజం. అయితే ఈ రెంటినీ ఒక్కొక్కరు ఒక్కో విధంగా తీసుకుంటారు. కొందరు ఎంత పెద్ద సమస్యనైనా లైట్‌ తీసుకుంటారు. కొందరు చిన్న సమస్యకు కూడా నానా హైరానా పడిపోతారు. కానీ, సమస్యలకు సెల్యూట్‌ చెప్పేవాళ్లు ఉంటారా? కాజల్‌ అగర్వాల్‌ వంటి కొంత మంది చెబుతారు. గత బుధవారంతో ఈ బ్యూటీ తెరపై కనిపించి పదేళ్లవుతోంది. తెలుగు పరిశ్రమకు కాజల్‌ కథానాయికగా పరిచయమైన ‘లక్ష్మీ కల్యాణం’ చిత్రం 2007 ఫిబ్రవరి 15న విడుదలైంది.

ఇండస్ట్రీకి వచ్చి పదేళ్లయిన సందర్భంగా కాజల్‌ అగర్వాల్‌ మాట్లాడుతూ – ‘‘ఇన్నేళ్ల కెరీర్‌లో నాకు ఎదురైన సమస్యలకు సెల్యూట్‌. అలా ఎందుకంటున్నానంటే అవి లేకపోతే నాలో పరిణతి వచ్చేది కాదు. నేను స్ట్రాంగ్‌ గాళ్‌ని అయ్యేదాన్ని కాదు. ఇన్నేళ్లల్లో ఎన్నో హ్యాపీ మూమెంట్స్, డల్‌ మూమెంట్స్‌ ఉన్నాయి. ఎప్పుడైనా సరే డల్‌ మూమెంట్స్‌ పాఠాలు నేర్పిస్తాయి. అందుకే నాకెదురైన హ్యాపీ మూమెంట్స్‌కి కాకుండా స్ట్రగుల్స్‌కి థ్యాంక్స్‌ చెబుతున్నా’’ అన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement