కాజల్ బాటలో పూనం | Kajal follows to Punam | Sakshi
Sakshi News home page

కాజల్ బాటలో పూనం

Published Tue, May 3 2016 9:59 PM | Last Updated on Wed, Apr 3 2019 9:11 PM

కాజల్ బాటలో పూనం - Sakshi

కాజల్ బాటలో పూనం

నటిగా ఎవరి బాణీ వారికుంటుంది. అలాగే ఎవరి స్థాయి వారిది. జీవిత విధానం కూడా ఒక్కొక్కరికి ఒక్కోవిధంగా ఉంటుంది. నటి పూనంబాజ్వా మాత్రం జీవితంలో నటి కాజల్‌అగర్వాల్ పాలసీని అనుసరిస్తున్నట్లు తెలుస్తోంది. కాజల్‌అగర్వాల్ నటిగా దశాబ్దకాలాన్ని పూర్తి చేసుకున్నారు. ఇప్పటికీ నటిగా బిజీగా ఉన్నారు. దీంతో వివాహ ఘడియలకు ఇంకా సమయం ఉందంటూ దాన్ని వాయిదా వేసుకుంటూ వస్తున్నారు. అయితే తన చెల్లెలు నిషా అగర్వాల్ మాత్రం పెళ్లి చేసుకుని భర్తతో కాపురం చేసుకుంటున్నారు. ఇక పూనంబాజ్వా జీవితం ఇందుకు భిన్నం కాదు.

ఆ మధ్య నటిగా కాస్త వెనుక బడ్డా ఇటీవల ఆంబళ, అరణ్మయణై-2 చిత్రాలతో మళ్లీ గాడిలో పడ్డారు. అయితే అనూహ్యంగా ఈ భామ పెళ్లి చేసుకున్నారనే ప్రచారం మీడియాలో హల్‌చల్ చేస్తోంది. టాలీవుడ్ దర్శకుడు సునీల్‌రెడ్డితో పూనంబాజ్వా పెళ్లి సమీపకాలంలో జరిగిందనే ప్రచారం ఈ అమ్మడిని కాస్త షాక్‌కు గురి చేసిందనే చెప్పాలి. కారణం పూనం ఇప్పుడే నటిగా రెండో ఇన్నింగ్స్‌ను ప్రారంభించారు. ప్రస్తుతం సుందర్.సీకి జంటగా ఒక చిత్రంలో నటిస్తున్నారు.

ఇలాంటి సమయంలో పెళ్లి వార్త కెరీర్‌కు ఇబ్బంది కలిగిస్తుందనుకున్న పూనంబాజ్వా వెంటనే స్పందిస్తూ తన పెళ్లి వార్త వదంతేనని స్పష్టం చేశారు. అయితే ఇటీవల తన చెల్లెలి పెళ్లి జరిగిందనీ, దాన్ని తన పెళ్లిగా భావించిన కొందరు ఇలా ప్రచారం చేస్తున్నారనీ పేర్కొన్నారు. తనకు ఇప్పుడే పెళ్లి చేసుకునే ఆలోచన లేదని పూనంబాజ్వా స్పష్టం చేశారు. మొత్తం మీద కాజల్‌అగర్వాల్ మాదిరిగానే పూనంబాజ్వా కూడా చెల్లెలికి పెళ్లి చేసి ఆమె పాలసీని అనుసరిస్తున్నారన్న మాట.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement