Wedding news
-
రణ్‌బీర్‌ను పెళ్లి చేసుకోవాలని అప్పుడే అనిపించింది: అలియా
Alia Bhatt Reveals When She Wants Marry Ranbir Kapoor: బాలీవుడ్ తారలు వరుసగా ప్రేమ పెళ్లిళ్లు చేసుకుని ప్రేక్షకులకు, అభిమానులకు కనులవిందు ఇచ్చారు. ప్రస్తుతం ఉన్న ప్రేమ పక్షుల్లో అలియా భట్, రణ్‌బీర్ కపూర్ జంట ఒకటి. వీరిద్దరి వివాహం ఎప్పుడా అనే ప్రశ్న ప్రతీసారి వినిపిస్తూనే ఉంటుంది. ప్రతీసారి ఫలానా తేది అంటూ వార్తలు చక్కర్లూ కొడుతూనే ఉన్నాయి. ఇదే ప్రశ్నను అభిమానులుు, ఆడియెన్స్, నెటిజన్లు అలియా, రణ్‌బీర్‌ను చాలాసార్లు అడిగారు. అయితే తాజాగా మరోసారి అలియాకు ఇదే ప్రశ్న ఎదురైంది. అలియా నటించిన తాజా చిత్రం 'గంగూబాయి కతియావాడీ' ఫిబ్రవరి 25న విడుదలైంది. ఈ సందర్భంగా సినిమా ప్రచార కార్యక్రమాల్లో పాల్గొన్న అలియాను మీ పెళ్లెప్పుడు అని అడిగారు. దానికి అలియా 'మీ పెళ్లెప్పుడూ అని పదే పదే అడుగుతున్నారు. దీని గురించి రెండు విషయాలు చెప్పాలి. మొదటిది ఇది ఎవరికీ సంబంధించిన విషయం కాదు. నా వ్యక్తిగతం. ఇక రెండోది ఏంటంటే పెళ్లి అనేది మనసుకు సంబంధించినది. రిలేషన్‌షిప్‌తో ప్రశాంతంగా ఉన్నప్పుడే చేసుకోవాలి. ఇప్పుడు నా మనసు ప్రశాంతంగా ఉంది. నా ఇష్టం, రణ్‌బీర్ ఇష్టాలకు అనుగుణంగా ఎప్పుడు జరగాలనుంటే అప్పుడే మా వివాహం జరుగుతుంది. నిజం చెప్పాలంటే రణ్‌బీర్‌తో మానసికంగా నాకు ఎప్పుడో పెళ్లి అయిపోయింది. నా చిన్నతనంలోనే రణ్‌బీర్‌ను మొదటిసారి స్క్రీన్‌పై చూసినప్పుడే అతణ్ని పెళ్లి చేసుకోవాలనిపించింది.' అని తెలిపింది. ఇదిలా ఉంటే వీళ్లిద్దరూ కలిసి నటించిన బ్రహ్మాస్త్ర సినిమా విడుదలకు సిద్ధమవుతోంది. -
ఆ కథనాలతో విజయ్ దేవరకొండకు మండిపోయింది
Rashmika Mandanna and Vijay Devarakonda: పెళ్లిచూపులు సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్న హీరో విజయ్ దేవరకొండా. ‘అర్జున్‌రెడ్డి’, ‘గీత గోవిందం’ చిత్రాలు విజయం సాధించడంతో యూత్‌తో క్రేజ్ సంపాదించాడు. ‘గీత గోవిందం’ చిత్రంలో హీరో విజయ్, రష్మిక మందన్నా కెమిస్ట్రీ అభిమానులను ఆకట్టుకున్న విషయం తెలిసిందే. అయితే అప్పటి నుంచే వీరిద్దరి మధ్య సమ్ థింగ్ సమ్‌థింగ్ ఉందంటూ మీడియాల్లో కథనాలు వస్తుంటాయి. ఇద్దరూ డేటింగ్లో ఉన్నారంటూ కలిసి ఉన్న ఫొటోల్ని, వీడియోలను షేర్ చేస్తుంటారు. ఇక థంబ్‌నెయిల్స్ బ్యాచ్ సంగతి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అయితే తాజాగా కొన్ని బాలీవుడ్ వెబ్సైట్లు.. వాటి ఆధారంగా కొన్ని లోకల్ వెబ్సైట్లు ఓ అడుగు ముందుకు వేసి కథనాలు ఇచ్చాయి. విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నా త్వరలో పెళ్లిపీటలెక్కబోతున్నారని వార్తలు రాసేశారు. వీటిపై తాజాగా విజయ్ దేవరకొండ స్పందిస్తూ.. తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ప్రతీసారి వార్తల్లో ఇదే చెత్తను చూడాల్సి వస్తోందని ట్విటర్లో కాస్త బూతుపురాణంతోనే చిరాకు వ్యక్తం చేశాడు. తద్వారా అది ఒక ఫేక్ వార్త అని చెబుతూనే.. మీడియాకు చురకలు అంటించాడు. As usual nonsense.. Don’t we just ❤️ da news! — Vijay Deverakonda (@TheDeverakonda) February 21, 2022 -
పెళ్లి కబురు చెబుతారా?
ప్రభాస్ పెళ్లి కుదిరింది. ఓ ప్రముఖ వ్యాపారవేత్త కుమార్తెను పెళ్లాడనున్నారు అనే వార్త ఎప్పటినుంచో వినిపిస్తోంది. ఇప్పుడు ఓ కొత్త వార్త తెరమీదకు వచ్చింది. అదేంటంటే.. ఈ ఏడాది తన పుట్టినరోజు నాడు ప్రభాస్ పెళ్లి కబురు చెప్పబోతున్నారట. అప్పట్లో అంటే..‘బాహుబలి’ టైమ్‌లో ప్రభాస్‌కు 6 వేల పెళ్లిసంబంధాలు వచ్చాయన్న వార్తలు కూడా వచ్చాయి. అలాగే ‘బాహుబలి’ సినిమా విడుదల తర్వాత ప్రభాస్‌కు ఎంతటి స్టార్డమ్ వచ్చిందో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. ఆ సినిమా తర్వాత పెళ్లి చేసుకుంటానని ప్రభాస్ పలు సందర్భాల్లో చెప్పారు కూడా. అయితే, సినిమా వచ్చింది.. వెళ్లింది. ప్రభాస్ పెళ్లి కబురు మాత్రం చెప్పలేదు. ఈ ఆరడుగుల అందగాడు ఎవరింటి అల్లుడు అవుతాడో.. ఏ అమ్మాయితో పెళ్లి పీటల మీద కూర్చోబోతున్నాడో అక్టోబర్ 23న తెలిసే అవకాశం ఉందట. ఆ రోజు ప్రభాస్ బర్త్‌డే. అలాగే ‘సాహో’ సెకండ్ టీజర్ కూడా బర్త్‌డే సందర్భంగా అక్టోబర్ 23నే వస్తుందన్న ఊహగానాలు ఉన్నాయి. ‘సాహో’ కాకుండా ‘జిల్’ ఫేమ్ రాధాకృష్ణ దర్శకత్వంలో ఓ సినిమాతో ప్రభాస్ బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. -
శ్రియకు పెళ్లా
తమిళసినిమా: నటి శ్రియకు పెళ్లంట. ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్న వార్త ఇదే. నటిగా ఈ ఉత్తరాది భామ వయసు 15 ఏళ్లు. ఇష్టం చిత్రంతో టాలీవుడ్‌కు, ఉనక్కు 20 ఎనక్కు 18 చిత్రంతో కోలీవుడ్‌కు పరిచయమైన శ్రియ ఆ తరువాత ఈ రెండు భాషల్లోనూ ఒక్కో మెట్టూ ఎక్కుతూ అగ్రనటిగా పేరు తెచ్చుకుంది. ముఖ్యంగా కోలీవుడ్‌లో చాలా తక్కువ కాలంలోనే సూపర్‌స్టార్ రజనీకాంత్‌తో శివాజీ చిత్రంలో జోడీ కట్టే అవకాశాన్ని దక్కించుకున్న నటి శ్రియ. అలా విజయ్, విశాల్, ధనుష్ అంటూ స్టార్ హీరోలందరితోనూ వరుస పెట్టి నటించేసింది. అదే విధంగా తెలుగులోనూ చిరంజీవి నుంచి ప్రముఖ నటులందరితోనూ నటించి విజయాలను తన ఖాతోలో వేసుకుంది. హిందీలోనూ గుర్తింపు పొందిన శ్రియకు పెళ్లి గడియలు ముంచుకొచ్చేస్తున్నాయని, మార్చిలోనే రష్యాకు చెందిన తన బాయ్‌ఫ్రెండ్‌తో పీపీపీ..డుండుండుంకు రెడీ అయిపోతుందనే ప్రచారం హోరెత్తుతోంది. అయితే శ్రియ పెళ్లి చేసుకోబోతోందన్న ప్రచారాన్ని ఆమె తల్లి నీర్జ ఖండించింది. ఈమె ఒక ఆంగ్లపత్రికకు ఇచ్చిన భేటీలో శ్రియ పెళ్లి వార్తలో ఏ మాత్రం నిజం లేదని స్పష్టం చేశారు. శ్రియ ప్రస్తుతం తమిళం, తెలుగు భాషా చిత్రాలతో బిజీగా ఉందని చెప్పారు. అయితే రాజస్థాన్‌లోని తన మిత్రుడి పెళ్లికి వెళ్లిందని, అందులో భాగంగా ఒక డిజైనర్‌కు ప్రత్యేకంగా జ్యువెలరీ, డ్రస్‌ను తయారు చేయడానికి ఆర్డర్ చేసిందని, దీంతో తన పెళ్లికే ఈ జ్యువెలరీ, డ్రస్‌ను ఆర్డర్ చేసిందని భావించి నెటిజన్లు పెళ్లి ప్రచారం చేస్తున్నారని వివరించారు. అలాంటి ప్రచారాన్ని ఎవరూ నమ్మొద్దని శ్రియతల్లి నీర్జ పేర్కొన్నారు. శ్రియ నటించిన తెలుగు చిత్రం గాయత్రి శుక్రవారం తెరపైకి రానుంది. తమిళంలో అరవిందస్వామితో కలిసి నరకాసురన్ చిత్రంలో నటిస్తోంది. -
అనుష్కకు ఏటీఎం
ఏటీఎం అంటే ఎనీటైమ్ మనీ అనో, ఎనీటైమ్ మర్డర్ అనో అనుకోకండి. దానిని ఎనీటైమ్ మ్యారేజ్ అని కూడా అనొచ్చు. ఇప్పుడర్థం అయ్యిందనుకుంటా అనుష్క పెళ్లి వార్త గురించి ఎప్పుడైనా ప్రకటన రావచ్చునని. ఈ విషయంలో ఆమె కుటుంబ సభ్యులు చాలా ముమ్మరంగా ప్రయత్నాలు చేస్తున్నారట. అందుకే అనుష్క కొత్త చిత్రాలను అంగీకరించడం లేదని సమాచారం. అంతే కాదు గతంలో యోగా టీచర్ అయిన ఈ బ్యూటీ త్వరలో యోగా శిక్షణ ఇన్స్టిట్యూట్ నెలకొల్పాలని భావిస్తున్నారని సమాచారం. అనుష్క ఈ పేరు ఇప్పుడు అభినయానికి మారుపేరుగా మారింది. అద్భుత చిత్రాలకు చిరునామాగా నిలిచిందని కూడా చెప్పవచ్చు. అరుంధతితో ప్రారంభమైన అనుష్క హవా నేటికీ అప్రహతంగా కొనసాగుతోంది. అరుంధతి, రుద్రమదేవి వంటి చిత్రాల తరువాత బాహుబలి–2 ఈ అభినేత్రి నటనకు పరాకాష్ట అనడం అతిశయోక్తి కాదేమో. ఆదిలో అందాలప్రదర్శనకు పరిమితమైన ఈ యోగా సుందరి ఆ తరువాత అభినయానికి కేరాఫ్‌గా మారారు. ఆ మధ్య ఓం నమో వేంకటేశాయ చిత్రంలో భక్తురాలిగా కూడా తనదైన నటనతో మెప్పించారు. ఎలాంటి పాత్రనైనా అవలీలగా పోషించేస్థాయికి చేరుకున్న అనుష్క తాజాగా తన అభిమానులకు షాక్ ఇవ్వనున్నారా? ప్రస్తుతం సినీ వర్గాల్లో హల్చల్ చేస్తున్న టాక్ ఇదే. నటి అనుష్క ప్రస్తుతం టాలీవుడ్లో భాగమతి మూడు చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉన్నారు. వాటిని త్వరత్వరగా పూర్తి చేసే పనిలో ఉన్నారట. అంతే కాదు ఇప్పటికే కోలీవుడ్‌లోని తన సహాయకులను పని నుంచి నిలిపివేశారనే ప్రచారం జోరందుకుంది. ఇదంతా చూస్తే ఏవరైనా ఏమి ఊహించుకుంటారు. ఎస్. ఈ ముద్దుగుమ్మకు వివాహ గడియలు దూసుకొస్తున్నాయట. -
కాజల్ బాటలో పూనం
నటిగా ఎవరి బాణీ వారికుంటుంది. అలాగే ఎవరి స్థాయి వారిది. జీవిత విధానం కూడా ఒక్కొక్కరికి ఒక్కోవిధంగా ఉంటుంది. నటి పూనంబాజ్వా మాత్రం జీవితంలో నటి కాజల్‌అగర్వాల్ పాలసీని అనుసరిస్తున్నట్లు తెలుస్తోంది. కాజల్‌అగర్వాల్ నటిగా దశాబ్దకాలాన్ని పూర్తి చేసుకున్నారు. ఇప్పటికీ నటిగా బిజీగా ఉన్నారు. దీంతో వివాహ ఘడియలకు ఇంకా సమయం ఉందంటూ దాన్ని వాయిదా వేసుకుంటూ వస్తున్నారు. అయితే తన చెల్లెలు నిషా అగర్వాల్ మాత్రం పెళ్లి చేసుకుని భర్తతో కాపురం చేసుకుంటున్నారు. ఇక పూనంబాజ్వా జీవితం ఇందుకు భిన్నం కాదు. ఆ మధ్య నటిగా కాస్త వెనుక బడ్డా ఇటీవల ఆంబళ, అరణ్మయణై-2 చిత్రాలతో మళ్లీ గాడిలో పడ్డారు. అయితే అనూహ్యంగా ఈ భామ పెళ్లి చేసుకున్నారనే ప్రచారం మీడియాలో హల్చల్ చేస్తోంది. టాలీవుడ్ దర్శకుడు సునీల్‌రెడ్డితో పూనంబాజ్వా పెళ్లి సమీపకాలంలో జరిగిందనే ప్రచారం ఈ అమ్మడిని కాస్త షాక్‌కు గురి చేసిందనే చెప్పాలి. కారణం పూనం ఇప్పుడే నటిగా రెండో ఇన్నింగ్స్‌ను ప్రారంభించారు. ప్రస్తుతం సుందర్.సీకి జంటగా ఒక చిత్రంలో నటిస్తున్నారు. ఇలాంటి సమయంలో పెళ్లి వార్త కెరీర్‌కు ఇబ్బంది కలిగిస్తుందనుకున్న పూనంబాజ్వా వెంటనే స్పందిస్తూ తన పెళ్లి వార్త వదంతేనని స్పష్టం చేశారు. అయితే ఇటీవల తన చెల్లెలి పెళ్లి జరిగిందనీ, దాన్ని తన పెళ్లిగా భావించిన కొందరు ఇలా ప్రచారం చేస్తున్నారనీ పేర్కొన్నారు. తనకు ఇప్పుడే పెళ్లి చేసుకునే ఆలోచన లేదని పూనంబాజ్వా స్పష్టం చేశారు. మొత్తం మీద కాజల్‌అగర్వాల్ మాదిరిగానే పూనంబాజ్వా కూడా చెల్లెలికి పెళ్లి చేసి ఆమె పాలసీని అనుసరిస్తున్నారన్న మాట.