అనుష్కకు ఏటీఎం | hulchal in anushka marriage news | Sakshi
Sakshi News home page

అనుష్కకు ఏటీఎం

Published Sat, May 6 2017 1:33 AM | Last Updated on Tue, Sep 5 2017 10:28 AM

అనుష్కకు ఏటీఎం

అనుష్కకు ఏటీఎం

ఏటీఎం అంటే ఎనీటైమ్‌ మనీ అనో, ఎనీటైమ్‌ మర్డర్‌ అనో అనుకోకండి. దానిని ఎనీటైమ్‌ మ్యారేజ్‌ అని కూడా అనొచ్చు. ఇప్పుడర్థం అయ్యిందనుకుంటా అనుష్క పెళ్లి వార్త  గురించి ఎప్పుడైనా ప్రకటన రావచ్చునని. ఈ విషయంలో ఆమె కుటుంబ సభ్యులు చాలా ముమ్మరంగా ప్రయత్నాలు చేస్తున్నారట. అందుకే అనుష్క కొత్త చిత్రాలను అంగీకరించడం లేదని సమాచారం. అంతే కాదు గతంలో యోగా టీచర్‌ అయిన ఈ బ్యూటీ త్వరలో యోగా శిక్షణ ఇన్‌స్టిట్యూట్‌ నెలకొల్పాలని భావిస్తున్నారని సమాచారం. అనుష్క ఈ పేరు ఇప్పుడు అభినయానికి మారుపేరుగా మారింది.

అద్భుత చిత్రాలకు చిరునామాగా నిలిచిందని కూడా చెప్పవచ్చు. అరుంధతితో ప్రారంభమైన అనుష్క హవా నేటికీ అప్రహతంగా కొనసాగుతోంది. అరుంధతి, రుద్రమదేవి వంటి చిత్రాల తరువాత బాహుబలి–2 ఈ అభినేత్రి నటనకు పరాకాష్ట అనడం అతిశయోక్తి కాదేమో. ఆదిలో అందాలప్రదర్శనకు పరిమితమైన ఈ యోగా సుందరి ఆ తరువాత అభినయానికి కేరాఫ్‌గా మారారు. ఆ మధ్య ఓం నమో వేంకటేశాయ చిత్రంలో భక్తురాలిగా కూడా తనదైన నటనతో మెప్పించారు. ఎలాంటి పాత్రనైనా అవలీలగా పోషించేస్థాయికి చేరుకున్న అనుష్క తాజాగా తన అభిమానులకు షాక్‌ ఇవ్వనున్నారా? ప్రస్తుతం సినీ వర్గాల్లో హల్‌చల్‌ చేస్తున్న టాక్‌ ఇదే.

నటి అనుష్క ప్రస్తుతం టాలీవుడ్‌లో భాగమతి మూడు చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉన్నారు. వాటిని త్వరత్వరగా పూర్తి చేసే పనిలో ఉన్నారట. అంతే కాదు ఇప్పటికే కోలీవుడ్‌లోని తన సహాయకులను పని నుంచి నిలిపివేశారనే ప్రచారం జోరందుకుంది. ఇదంతా చూస్తే ఏవరైనా ఏమి ఊహించుకుంటారు. ఎస్‌. ఈ ముద్దుగుమ్మకు వివాహ గడియలు దూసుకొస్తున్నాయట.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement