Vijay Devarakonda Irritates On Wedding Rumours With Rashmika Mandanna - Sakshi
Sakshi News home page

Rashmika Mandanna-Vijay Devarakonda:ఆ కథనాలతో విజయ్‌ దేవరకొండకు మండిపోయింది

Published Mon, Feb 21 2022 9:19 PM | Last Updated on Tue, Feb 22 2022 9:17 AM

Vijay Devarakonda Irritates On Wedding With Rashmika Mandanna News - Sakshi

Rashmika Mandanna and Vijay Devarakonda: పెళ్లిచూపులు సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్న హీరో విజయ్‌ దేవరకొండా. ‘అర్జున్‌రెడ్డి’, ‘గీత గోవిందం’ చిత్రాలు విజయం సాధించడంతో యూత్‌తో క్రేజ్‌ సంపాదించాడు.

‘గీత గోవిందం’ చిత్రంలో హీరో విజయ్‌, రష్మిక మందన్నా కెమిస్ట్రీ అభిమానులను ఆకట్టుకున్న విషయం తెలిసిందే. అయితే అప్పటి నుంచే వీరిద్దరి మధ్య సమ్‌ థింగ్‌ సమ్‌థింగ్‌ ఉందంటూ మీడియాల్లో కథనాలు వస్తుంటాయి. ఇద్దరూ డేటింగ్‌లో ఉన్నారంటూ కలిసి ఉన్న ఫొటోల్ని, వీడియోలను షేర్‌ చేస్తుంటారు. ఇక థంబ్‌నెయిల్స్‌ బ్యాచ్‌ సంగతి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అయితే తాజాగా కొన్ని బాలీవుడ్‌ వెబ్‌సైట్లు.. వాటి ఆధారంగా కొన్ని లోకల్‌ వెబ్‌సైట్లు ఓ అడుగు ముందుకు వేసి కథనాలు ఇచ్చాయి. 

విజయ్‌ దేవరకొండ, రష్మిక మందన్నా త్వరలో పెళ్లిపీటలెక్కబోతున్నారని వార్తలు రాసేశారు. వీటిపై తాజాగా విజయ్‌ దేవరకొండ స్పందిస్తూ.. తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ప్రతీసారి వార్తల్లో ఇదే చెత్తను చూడాల్సి వస్తోందని ట్విటర్‌లో కాస్త బూతుపురాణంతోనే చిరాకు వ్యక్తం చేశాడు. త​ద్వారా అది ఒక ఫేక్‌ వార్త అని చెబుతూనే.. మీడియాకు చురకలు అంటించాడు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement