ఆ డైరెక్టర్కు కంగనా నో చెప్పేసింది
ముంబయి: ప్రముఖ బాలీవుడ్ దర్శకుడు హోమీ అదజానియా తెరకెక్కించనున్న చిత్రంలో నటించేందుకు బాలీవుడ్ భామ కంగనా రనౌత్ నో చెప్పేసింది. ఆయన ఎంతో శ్రద్ధతో వెళ్లి స్క్రిప్ట్ వినిపించినప్పటికీ ఆమె నటించడం సాధ్యం కాదని చెప్పినట్లు బాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. ఇప్పటికే పలు చిత్రాలకోసం ఒప్పందం చేసుకున్నానని, డేట్లు సర్దుబాటుకావడం లేదని సున్నితంగా ఆయనను తిరస్కరించిందంట.
'హోమీ ఇప్పటికే కంగనాకు స్క్రిప్ట్ వినిపించాడు. ఆమె కూడా ఆయనతో పనిచేసేందుకు ఇష్టంగానే ఉంది. కానీ హన్సాల్ హెహతా చిత్రం రంగూన్ కోసం ఇప్పటికే ఒప్పందాలు జరిగినందున ఆమెకు డేట్లు సర్దుబాటుకావడం లేదు. అయితే భవిష్యత్తులో తప్పకుండా ఆయనతో కలిసి పనిచేస్తానని కంగనా చెప్పింది' అని కంగనా సన్నిహిత వర్గాలు తెలిపాయి. కాగా, ఈ చిత్రంలో కంగనానే హీరోయిన్గా నటింపజేసేందుకే హోమీ ఎంతో మానసికంగా సిద్ధమై ఉన్నారంట.