బిగ్‌బాస్‌లో పాల్గొనాలని... | Kannada Bigg Boss Aspirant reached Bengaluru on Bicycle | Sakshi

బిగ్‌బాస్‌లో పాల్గొనాలని...

Oct 4 2017 9:39 AM | Updated on Oct 4 2017 1:09 PM

BiggBoss_Kannada

సాక్షి, బెంగళూరు: బిగ్‌బాస్‌ పోటీలో పాల్గొనాలని ఆకాంక్షతో కర్ణాటక బెళగావి జిల్లా మూడలగికి చెందిన ఓ యువకుడు బెంగళూరుకు సైకిల్‌పై చేరుకున్నాడు. కన్నడలో బీన్‌ అనే పేరుతో వివిధ కార్యక్రమాలను చేపట్టిన కళాకారుడు మంజునాథ మంగళవారం నగర ప్రెస్‌క్లబ్‌లో తన ఆకాంక్షను విలేకరులకు వివరించాడు.

                                                                                                                                                                                                                                                                      
బిగ్‌బాస్‌ పోటీల్లో పాల్గొనాలని కోరికతో మూడలగి నుంచి బెంగళూరుకు సైకిల్‌ ద్వారా 650 కిలోమీటర్లు శ్రమిస్తూ వచ్చానని, మూడలగి నుంచి గోకాక్, ధారవాడ, హుబ్లీ, హావేరి, దావణగెర, తుమకూరు మీదుగా బెంగళూరు చేరుకున్నానని చెప్పాడు. ఈ మార్గంలో పలువురు తన ఆకాంక్షకు మద్దతు కూడా ఇచ్చారని, బిగ్‌బాస్‌ కార్యక్రమ నిర్వాహకులను కలుసుకోవటానికి ప్రయత్నిస్తున్నానని తెలిపాడు. కన్నడ బిగ్‌బాస్‌ ఐదో సీజన్‌ ఈ నెల 15 నుంచి ప్రారంభంకానుంది. ఈ షోకు ప్రముఖ నటుడు సుదీప్‌ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all

Video

View all
Advertisement