మీడియా నేపథ్యంలో...
‘‘ఇప్పటి వరకూ జర్నలిజం ప్రధానాంశంగా పలు చిత్రాలొచ్చాయి. కానీ, మా ‘కాపాళి’ వాటికి భిన్నంగా ఉంటుంది. జర్నలిస్టులు నిజ జీవితంలో ప్రాణాలు పణంగా పెట్టి ఎలా కష్టపడుతున్నారో కళ్లకు కట్టినట్టు చూపించాం’’ అని దర్శక-నిర్మాత మేసా రాజేశ్ అన్నారు. ఆయన లీడ్ రోల్‌లో నటించి, రోహిణ్ ప్రొడక్షన్స్ పతాకంపై నిర్మించిన ‘కాపాళి’ టీజర్‌ను నిర్మాత రాజ్ కందుకూరి విడుదల చేశారు.
రాజేశ్ మాట్లాడుతూ-‘‘తనకు అప్పగించిన ఓ పనిని ఫౌండ్ పుటేజ్ ఆధారంగా ఓ జర్నలిస్ట్ ఎలా పూర్తి చేశాడన్నదే కథ. థ్రిల్లర్, సస్పెన్స్ మూవీ. నాలుగు కథలు ఒకేసారి జరుగుతుంటాయి. మా చిత్రం తరహా కై్లమాక్స్ ఇప్పటివరకూ ఏ సినిమాలోనూ రాలేదు. అన్నివర్గాల ప్రేక్షకులకు ఈ చిత్రం నచ్చుతుందనే నమ్మకం ఉంది’’ అని చెప్పారు.