టీవీ షో వివాదం; దర్శక నిర్మాతలకు సమన్లు
2013లో ప్రసారమయిన వివాదాస్పద టివీ షో ఏఐబి నాక్అవుట్ వివాదం కరణ్ జోహర్ను ఇప్పటికీ వెంటాడుతోంది. అర్జున్ కపూర్, రణవీర్ సింగ్, దీపికా పదుకోణ్ లాంటి బాలీవుడ్ టాప్స్టార్స్ పాల్గొన్న ఈ షోలో సెలబ్రిటీల భాష అసభ్యంగా ఉందంటూ వివాదం జరిగింది. ముఖ్యంగా షోలో అర్జున్ కపూర్, రణవీర్ సింగ్ల బిహేవియర్తో పాటు కరణ్ జోహార్ చేసిన కొన్ని వ్యాఖ్యలు కూడా సంచలనం సృష్టించాయి.
2013లో డిసెంబర్లో ప్రసారం అయిన ఈ షోను తరువాత ఆన్ లైన్ లో పెట్టారు. ఆన్లైన్ లో పెట్టడం ద్వారా మరింత ప్రచారం కలగటంతో సామాజిక కార్యకర్త సంతోష్ దౌండకర్, 2014 ఫిబ్రవరిలో సిటీ కోర్టులో కేసు వేశారు. ఆ కార్యక్రమాన్ని పరిశీలించిన కోర్టు అందులో పాల్గొన్న వ్యక్తుల పై ఎఫ్ఐఆర్ నమోదు చేయాల్సిందింగా పోలీసులను ఆదేశించింది. దీంతో ఏఐబి షోలో పాల్గొన్న ప్రముఖ బాలీవుడ్ నిర్మాత కరణ్ జోహర్ పై కూడా కేసు నమెదైంది.
కరణ్ స్టేట్మెంట్ ను రికార్డ్ చేయటం కోసం ఆయన్ను టార్డియో పోలీస్ స్టేషన్కు హాజరు కావాల్సింది సమన్లు పంపించారు. ప్రస్తుతం ఓ సెలెబ్రిటి షో కోసం లండన్లో ఉన్న కరణ్ ఈ విషయం పై స్పందించడానికి నిరాకరించినట్టుగా సమాచారం. కరణ్ జోహార్తో పాటు అర్జున్ కపూర్, రణవీర్ సింగ్, దీపికా పదుకోణ్లపై ఐపిసి సెక్షన్ 295 కింద కేసు నమోదు చేశారు.