కరీనా కపూర్, మీరా రాజ్‌పుత్, షాహిద్ కపూర్
సాక్షి, ముంబై: బాలీవుడ్‌లో ఎప్పుడూ టాక్ ఆఫ్ ది టౌన్‌గా నిలిచే సెలబ్రిటీలలో నటి కరీనా కపూర్ ఒకరని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తాజాగా తన మాజీ ప్రియుడు షాహిద్ కపూర్‌కు సంబంధించిన ఆసక్తికర విషయాన్ని కరీనా వెల్లడించారు. బాలీవుడ్ నటుడు షాహిద్ కపూర్, మీరా రాజ్‌పుత్‌ను వివాహం చేసుకుని.. అటు కెరీర్‌ను, ఇటు వ్యక్తిగత జీవితాన్ని హ్యాపీగా లీడ్ చేస్తున్నాడు. ఇప్పటికీ షాహిద్, తాను మంచి మిత్రులమేనని కరీనా చెప్పారు.
‘తాను పెళ్లిచేసుకోబుతున్నట్లు ముందుగా షాహిద్ నాకే చెప్పాడు. వివాహానికి తాను సిద్ధంగా ఉన్నానని, మీరా రాజ్‌పుత్‌ను త్వరలో పెళ్లి చేసుకుని కొత్త జీవితాన్ని ప్రారంభిస్తున్నానని అతడు నాకు తెలిపాడు. మీడియాకు, బహిరంగంగా ఈవెంట్లోనూ వెల్లడించక ముందే నా ఫ్రెండ్ షాహిద్ పెళ్లి చేసుకోనున్నట్లు గుడ్ న్యూస్ చెప్పగానే చాలా సంతోషించాను. ఫెమినా ఈవెంట్ సందర్భంగా ప్రొఫెషనల్, పర్సనల్ విషయాలను షాహిద్ షేర్ చేసుకున్నాడని’ కరీనాకపూర్ వెల్లడించారు. సోషల్ మీడియాలో వీరి అభిమానులు ఈ విషయంపై రీట్వీట్లు చేస్తున్నారు.
ఢిల్లీకి చెందిన మీరా రాజ్‌పుత్, నటుడు షాహిద్ కపూర్‌ల వివాహం 2015 జూలై 7న అంగరంగ వైభవంగా జరిగింది. కాగా, షాహిద్ వివాహానికి మాజీ ప్రేయసి కరీనాను పిలుస్తాడా లేదా అన్న అనుమానాలు పటాపంచలు చేస్తూ ఈ నటుడు మొదటి శుభలేఖతో సైఫ్ అలీ ఖాన్, కరీనా దంపతులను స్వయంగా ఇంటికెళ్లి ఆహ్వానించడం గమనార్హం. సైఫ్‌తో పెళ్లిక ముందు ఐదేళ్లపాటు షాహిద్, కరీనాలు గాఢంగా ప్రేమించుకున్నా.. ఏవో మనస్పర్థల కారణంగా విడిపోయిన విషయం తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment