
కోలీవుడ్ తో పాటు టాలీవుడ్ లో కూడా మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న హీరో కార్తీ. సూర్య తమ్ముడిగా ఇండస్ట్రీకి పరిచయం అయినా.. తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకొని సత్తా చాటాడు కార్తీ. అంతేకాదు అభిమానులను తరుచూ కలుస్తూ వారికి సాయం చేస్తూ తన పెద్ద మనసును చాటుకున్న కార్తీ, ఓ అభిమాని మృతితో కన్నీరు పెట్టుకున్నాడు. తిరుమన్నామలై కార్తీ ఫ్యాన్స్ అసోషియేషన్ కార్యదర్వి జీవన్ కుమార్ కారు ప్రమాదంలో మృతి చెందాడు. మూడు నెలల క్రితం జరిగిన జీవన్ కుమార్ వివాహ వేడుకకు కూడా కార్తీ హాజరై వధూవరులను ఆశీర్వదించారు. కొద్ది రోజులకే ఇలాంటి వార్త వినాల్సి రావటంతో కార్తీ ఎమోషనల్ అయ్యాడు.
Comments
Please login to add a commentAdd a comment