Jeevan Kumar
-
హత్య కేసులో ఐదుగురు నిందితుల అరెస్ట్
పెనమలూరు : కానూరు వద్ద జరిగిన చెన్నూరి అజయ్‌సాయి(22) హత్య కేసులో ఐదుగురు నిందితులను అరెస్టు చేశామని కృష్ణా జిల్లా ఎస్పీ పి.జాషువా తెలిపారు. పెనమలూరు పోలీస్‌స్టేషన్‌లో గురువారం ఆయన మీడియాకు వివరాలు వెల్లడించారు. తాడిగడప వసంతనగర్‌కు చెందిన చెన్నూరి అజయ్‌సాయి అదే గ్రామానికి చెందిన బొమ్మిడి మణికంఠ, పామర్తి మణికంఠ, పుట్టి శ్రీధర్, దొంపల ప్రశాంత్, పటమటకు చెందిన కగ్గా సాయినాగార్జునలు కలిసి ఈ నెల 7వ తేదీన పటమట రాజులబజార్లో ఉన్న స్నేహితుడు సంతోష్ ఇంట్లో మద్యం పార్టీ చేసుకున్నారు. ఆ సమయంలో బొమ్మిడి మణికంఠ ఇయర్ బడ్స్ కనిపించలేదు. అజయ్‌సాయిపై అనుమానంతో కొట్టారు. ఎనికేపాడు ఇంజినీరింగ్ కాలేజీ వద్ద బడ్స్ దాచానని అజయ్‌సాయి చెప్పడంతో అదే రోజు రాత్రి అతనిని బైక్ పై అక్కడికి తీసుకెళ్లారు. అక్కడ బడ్స్ దొరక్క పోవడంతో అజయ్‌సాయిపై విచక్షణ రహితంగా దాడి చేశారు. అపస్మారక స్థితిలో ఉన్న అజయ్‌సాయిని సాయినాగార్జున, పామర్తి మణికంఠ పటమట డొంక రోడ్డులోని ప్రైవేటు ఆస్పత్రిలో చేర్చారు. అజయ్‌సాయి కంకిపాడు ఫ్లైఓవర్ వద్ద ప్రమాదంలో గాయపడినట్లు వైద్యులను నమ్మించారు. అయితే అజయ్‌సాయి 8న ఆస్పత్రిలో మృతి చెందాడు. మృతి వివరాలు కంకిపాడు పోలీసులకు అందడంతో.. వారు విచారణ నిర్వహించగా అసలు విషయాలు వెలుగులోకొచ్చాయి. మృతుడి తండ్రి ఇచ్చిన ఫిర్యాదుతో పెనమలూరు పోలీసులు హత్య కేసు నమోదు చేశారు. పరారీలో ఉన్న నిందితులను సీఐ కిషోర్‌బాబు ఆధ్వర్యంలో ప్రత్యేక బృందాలు గాలించి పట్టుకున్నాయి. నిందితులపై రౌడీషీట్ కూడా తెరుస్తామని ఎస్పీ చెప్పారు. కాగా, ఇందులో వీరు గంజాయి వాడారన్న వచ్చిన వార్తలో నిజం లేదని ఎస్పీ తెలిపారు. రాజకీయ నాయకులు ఆరోపణలు చేసే ముందు వాస్తవాలు తెలుసుకోవాలని సూచించారు. పోలీసుల విచారణ జరక్క ముందే రాజకీయ నాయకులు అసత్య ఆరోపణలు చేయడం తగదన్నారు. జీవన్‌కుమార్‌ది ఆత్మహత్యే పెదపులిపాక గ్రామంలో కాలినగాయాలతో అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన జమ్మలమూడి జీవన్‌కుమార్(21)ది ఆత్మహత్యేనని ఎస్పీ జాషువా తెలిపారు. తన తండ్రి సుధాకర్ తీసుకున్న లోన్‌కు సంబంధించి ఈఎంఐ నగదులో రూ.12,500ను జీవన్‌కుమార్ ఖర్చు చేయడంతో తండ్రి మందలించాడు. దీంతో మనస్థాపంతో ఉన్న జీవన్‌కుమార్ ఈ నెల 9న గురునానక్‌కాలనీలోని రెస్టారెంట్లో మిత్రుడు శ్యామ్ బర్త్‌డే పార్టీలో పాల్గొన్నాడు. అనంతరం అదే రోజు రాత్రి యనమలకుదురు పెట్రోల్ బంక్‌లో పెట్రోల్ కొన్నాడు. ఈ విషయం సీసీ కెమెరాలో నమోదైంది. తొలుత జీవన్‌కుమార్‌ది హత్యగా భావించామని, డీఎస్పీ జయసూర్య విచారణలో జీవన్ కదలికల్లో ప్రతి నిమిషాన్ని విచారించి సాంకేతిక సాక్ష్యాలు సేకరించినట్టు ఎస్పీ జాషువా చెప్పారు. -
Pavala syamala : పావలా శ్యామలకు ఆర్థిక సహాయం చేసిన నటుడు
సాక్షి, హైదరాబాద్ : హాస్యనటిగా తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన నటి పావలా శ్యామల ప్రస్తుతం ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. ఓ అద్దె ఇంట్లో ఉంటూ అనారోగ్యంలో బాధపడుతుంది. టాలీవుడ్లో ఇప్పటివరకు దాదాపు 250 చిత్రాల్లో నటించి ఎన్నో అవార్డులు, రివార్డులు అందుకున్నఆమె.. ఆర్థిక కారణాల వల్ల అవార్డులు అమ్ముకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇంటి అద్దె కూడా కట్టలేని పరిస్థితుల్లో ఆమె ఉన్నారు. ఆర్థిక ఇబ్బందులకు తోడు కూతురి అనారోగ్యంతో పావలా శ్యామల పరిస్థితి దయనీయంగా మారింది. ఇప్పటికే ఆమెను ఆదుకోవడానికి మెగాస్టార్ చిరంజీవి సహా ఇండస్ర్టీకి చెందిన కొందరు ముందుకు వచ్చారు. తాజాగా నటుడు జీవన్ కుమార్ కూడా పావలా శ్యామలకు సాయమందించారు. ఆమె పరిస్థితిని తెలుసుకొని స్వయంగా ఇంటికి వెళ్లిన ఆయన తనవంతు సాయాన్ని ఆమెకు అందించారు. ఈ నగరానికి ఏమైంది , ఫలక్నామా దాస్, సఫారీ వంటి సినిమాల్లో నటించిన జీవన్ కుమార్ నిత్యావసరాలతో పాటు ప్రతి రోజు భోజన వసతి కూడా ఏర్పాటు చేసేందుకు ప్రయత్నిస్తానని తెలిపారు. ఇక జీవన్ కుమార్ అందించిన సహాయంపై నటి పావలా శ్యామల స్పందించారు. స్వయంగా ఇంటికి వచ్చి డబ్బులివ్వడం సంతోషమని, ఇప్పుడు తనకు బతకాలనే ఆశ ఉందని, తన కూతుర్ని కూడా బతికించుకుంటానని పేర్కొంది. ఇటీవలె పావలా శ్యామల ఇబ్బందులు తెలుసుకున్న నటి కరాటే కల్యాణి ఆమెను కలిసి తన వంతు సాయాన్ని అందించిన సంగతి తెలిసిందే. అలాగే మా అసోసియేషన్ ద్వారా కూడా సహాయం అందేలా ప్రయత్నం చేస్తానని అన్నారు. అదే విధంగా ప్రతి ఒక్కరు పావలా శ్యామలను ఆదుకునేందుకు ముందుకు రావాలని విజ్ఞప్తి చేశారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఆమెకు సహాయం చేయడానికి దాతలు ముందుకు వస్తున్నారు.ఇక ఖడ్గం, ఆంధ్రావాలా, బాబాయ్ హోటల్, గోలీమార్ వంటి సూపర్ చిత్రాల్లో నటించి పావలా శ్యామల గుర్తింపును సంపాదించుకున్న సంగతి తెలిసిందే. చదవండి : Pavala Syamala: పావలా శ్యామలకు మెగాస్టార్ చిరంజీవి సాయం పావలా శ్యామలకు ఆర్థిక సహాయం చేసిన డైరెక్టర్ -
అభిమాని మరణంతో కన్నీరు పెట్టుకున్న కార్తీ
కోలీవుడ్ తో పాటు టాలీవుడ్ లో కూడా మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న హీరో కార్తీ. సూర్య తమ్ముడిగా ఇండస్ట్రీకి పరిచయం అయినా.. తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకొని సత్తా చాటాడు కార్తీ. అంతేకాదు అభిమానులను తరుచూ కలుస్తూ వారికి సాయం చేస్తూ తన పెద్ద మనసును చాటుకున్న కార్తీ, ఓ అభిమాని మృతితో కన్నీరు పెట్టుకున్నాడు. తిరుమన్నామలై కార్తీ ఫ్యాన్స్ అసోషియేషన్ కార్యదర్వి జీవన్ కుమార్ కారు ప్రమాదంలో మృతి చెందాడు. మూడు నెలల క్రితం జరిగిన జీవన్ కుమార్ వివాహ వేడుకకు కూడా కార్తీ హాజరై వధూవరులను ఆశీర్వదించారు. కొద్ది రోజులకే ఇలాంటి వార్త వినాల్సి రావటంతో కార్తీ ఎమోషనల్ అయ్యాడు. -
ఎస్కేయూ డిగ్రీ పరీక్షలు వాయిదా
ఎస్కేయూ : వర్సిటీ అనుబంధ డిగ్రీ కళాశాలల్లో బీఏ, బీఎస్సీ, బీకామ్ రెండవ సంవత్సరం సప్లిమెంటరీ, 2,3 సెమిస్టర్ పరీక్షలు 28న జరగాల్సిన పరీక్షలు బంద్ కారణంగా వాయిదా వేసినట్లు యూజీ డీన్ జీవన్‌కుమార్ ఓ ప్రకటనలో తెలిపారు. రద్దయిన పరీక్షలు డిగ్రీ రెండవ సంవత్సరం సప్లిమెంటరీ పరీక్షలు డిసెంబర్ 7న, రెండవ సంవత్సరం మూడవ సెమిస్టర్ పరీక్షలు డిసెంబర్ 8న నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. -
వేధింపులతో విద్యార్థి ఆత్మహత్యాయత్నం
హైదరాబాద్: కార్పొరేట్ కళాశాల సిబ్బంది వేధింపులతో ఓ విద్యార్థి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన బుధవారం కుషాయిగూడ పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగింది. ప్రస్తుతం చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్న విద్యార్థి కేర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. దమ్మాయిగూడకు చెందిన సీహెచ్ హరిరామ్, సరిత దంపతుల రెండో కొడుకు జీవన్‌కుమార్(16) ఈసీఐఎల్‌లోని శ్రీచైతన్య జూనియర్ కళాశాలలో ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్నాడు. చూడటానికి కొంచెం లావుగా ఉండే జీవన్‌ను కళాశాల సిబ్బంది తరచు అవమానపరిచే వారని సహచర విద్యార్థులు ఆరోపించారు. కళాశాల అడ్మినిస్ట్రేషన్‌లో పనిచేసే శ్రీకాంత్, లెక్చరర్ శ్రీలత.. జీవన్‌ను ఒళ్లు పెంచావ్ కానీ చదవడం రాదా? ఇంత తక్కువగా మార్కులు ఎందుకు వస్తున్నాయ్.. తిండి కొంచెం తగ్గించు అంటూ తోటి విద్యార్థుల ఎదుట అవమానించడమే కాక.. కొట్టడం, తిట్టడం చేశారని జీవన్ స్నేహితులు చెప్పారు. దీంతో మనస్తాపం చెందిన జీవన్ పలుమార్లు సుసైడ్ చేసుకుంటా అని చెప్పినట్టు స్నేహితులు విలేకరులకు తెలిపారు. ఈ క్రమంలో సోమవారం కళాశాల నుంచి ఇంటికి వచ్చిన జీవన్ ఆ రోజు రాత్రి 8:30 సమయంలో నాగారంలోని కృష్ణ థియేటర్ సమీపంలో విషం తాగాడు. అపస్మారక స్థితిలోకి వెళ్లిన జీవన్‌ను గమనించిన స్థానికులు అతని కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. దీంతో వారు జీవన్‌ను చికిత్స నిమిత్తం బంజారాహిల్స్ కేర్ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం జీవన్ ఐసీయూలో చికిత్స పొందుతున్నాడు. -
రెండు బైక్‌లు ఢీ: వ్యక్తి మృతి
కొత్తగూడెం(ఖమ్మం జిల్లా): వేగంగా వెళ్తున్న రెండు బైక్‌లు ఎదురెదురుగా వచ్చి ఢీ కొనడంతో ఒక వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ సంఘటన గురువారం ఖమ్మం జిల్లా కొత్తగూడెం మండలం ఫోర్ ఇన్‌క్లేయిన్ చెక్‌పోస్ట్ దగ్గర జరిగింది. వివరాలు.. కొత్తగూడెం నుంచి రుద్రంపూర్ వెళ్తున్న బైక్‌ను కొత్తగూడెం వస్తున్న మరో బైక్ వచ్చి ఢీ కొట్టింది. ఈ ఘటనలో ఆదిలాబాద్ జిల్లా బెల్లంపల్లి మండలానికి చెందిన పవన్‌కల్యాణ్(17) అనే పాలిటెక్నిక్ విద్యార్థి అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ప్రమాదంలో గాయపడిన మరో ఇద్దరిని కొత్తగూడెం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. కాగా, ఆస్పత్రిలో చికిత్స పొందుతూ వరంగల్‌కు చెందిన ఒక వ్యక్తి మృతి చెందాడు. ఈ ప్రమాదంలో గాయపడిన జీవన్‌కుమార్ అనే వ్యక్తి పరిస్థితి ప్రస్తుతం విషమంగానే ఉన్నట్లు సమాచారం. విషయం తెలిసిన పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పోస్ట్‌మార్టం కోసం తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
ఇంజినీరింగ్ విద్యార్థి బలవన్మరణం
కర్నూలు: ఓ ఇంజనీరింగ్ విద్యార్థి కర్నూలు జిల్లాలో రైలు కింద పడి బలవన్మరణానికి పాల్పడ్డాడు. జిల్లాలోని ఆర్జీఎం ఇంజినీరింగ్ కాలేజ్ లో ఈఈఈ చదువుతున్న జీవన్ కుమార్ బుధవారం ఆత్మహత్యకు పాల్పడ్డాడు. వివరాలు ప్రకాశం జిల్లా దోర్నాల పట్టణానికి చెందిన జీవన్ స్థానిక ఆర్జీఎం కాలేజ్ లో ఈఈఈ చదువుతున్నాడు. అయితే మంగళవారం స్నేహితుల వద్దకు వెళ్లిన జీవన్ బుధవారం ఉదయం పట్టణ సమీపంలోని కోట్ల రైల్వే స్టేషన్ లో రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. విద్యార్థి తండ్రి సంపత్ వైఎస్ఆర్ జిల్లా ప్రొద్దుటూరులో కమర్షియల్ ట్యాక్స్ ఆఫీసర్‌గా పనిచేస్తున్నట్టు సమాచారం. స్థానికుల సమాచారంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. సంఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. -
'రైతు కుటుంబాలకు చేయూతలో అలసత్వం'
జగదేవ్‌పూర్(మెదక్): జీవో 421 అమలులో తెలంగాణ ప్రభుత్వం అలసత్వం వహిస్తోందని ఉభయ రాష్ట్రాల మానవ హక్కుల వేదిక అధ్యక్షుడు జీవన్‌కుమార్ అన్నారు. ఆదివారం మెదక్ జిల్లా జగదేవ్‌పూర్ మండలంలో అప్పుల బాధతో ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలను పరామర్శించారు. బాధిత కుటుంబ సభ్యులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆత్మహత్యకు పాల్పడిన రైతు కుటుంబాలకు సాయం అందించేందుకు ఉద్దేశించిన 421 జీవో అమల్లో ప్రభుత్వ తీరు సంతృప్తికరంగా లేదన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం పరిహారం రూ.1.50లక్షల నుంచి 5 లక్షలకు పెంచాలని కోరారు. ఆయా రైతు కుటుంబాలకు ఇళ్ల్లు, పిల్లల చదువు, ఇతర వసతులు ప్రభుత్వమే భరించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో మానవ హక్కుల వేదిక రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వి.ఎస్ కృష్ణ, కార్యదర్శి అన్వర్, జిల్లా ప్రధాన కార్యదర్శి ఆహ్మద్, తదితరులు ఉన్నారు. -
జగదాంబలో క్రేన్ బీభత్సం
విశాఖపట్నం, న్యూస్‌లైన్ : జగదాంబ జంక్షన్లో సోమవారం ఉదయం క్రేన్ బీభత్సం సృష్టించింది. బ్రేకులు ఫెయిలవడంతో పలు వాహనాలను ఢీకొంది. ద్విచక్రవాహనంపై విధులకు వెళ్తున్న ఐఎన్ఎస్ డేగా ఉద్యోగి ఈ సంఘటనలో దుర్మరణం చెందాడు. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాలివి. స్థానిక 21వ వార్డు తాడివీధికి చెందిన గరుగుమిల్లి జీవన్‌కుమార్(40) ఐఎన్ఎస్ డేగాలో స్ప్రే పెయింటర్‌గా పనిచేస్తున్నాడు. అతడికి భార్య మంగవేణి, కుమార్తె, కుమారుడు ఉన్నారు. డిగ్రీ చదువుతున్న కుమార్తె హరిప్రియను కళాశాల వద్ద దించేసి డ్యూటీకి వెళ్లేందుకు జగదాంబ జంక్షన్ వైపు వచ్చాడు. రెడ్ సిగ్నల్ పడడంతో సిగ్నల్ పాయింట్ వద్ద బైక్ నిలిపాడు. జగదాంబ జంక్షన్ వైపు వచ్చిన క్రేన్ బ్రేకులు ఫెయిలై బైక్‌ను ఢీకొంది. అతడు పక్కన పడిపోగా తలపై నుంచి క్రేన్ వె ళ్లిపోవడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. ఆగి ఉన్న కారును కూడా కొంత దూరం తోసుకుపోగా పలువురు రాళ్లు వేసి క్రేన్‌ను ఆపగలిగారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కేజీహెచ్‌కు తరలించారు. క్రేన్ డ్రైవర్ నాగరాజును పోలీసులు అరెస్టు చేశారు. టూటౌన్ ట్రాఫిక్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. అన్నయ్యని తెలియలేదు ప్రమాదం జరిగిన సమయంలో ఆ పక్కనే ఆటో నిలిపి ఉన్నానని, అన్నయ హెల్మెట్ ధరించి ఉండడంతో ఎవరో అనుకుని వెళ్లిపోయూనని మృతుడి సోదరుడు లబోదిబోమన్నాడు. సంఘటన ఉదయం 9.15 గ ంటల ప్రాంతంలో జరిగితే 10.30 గంటలకు తనకు సమాచారం వచ్చిందని వాపోయూడు. పోలీసుల నిర్లక్ష్యమే? ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 12 గంటలు, సాయంత్రం 4 నుంచి రాత్రి 8 గంటల సమయంలో నగరంలోకి భారీ వాహనాలకు అనుమతి లేదు. సామాన్యుడిపై ప్రతాపం చూపించే పోలీసులు భారీ వాహనాలపై ఉదాసీనంగా వ్యవహరించడం వల్లే ప్రమాదాలు జరుగుతున్నాయని విమర్శలు వినిపిస్తున్నాయి. రెండు రోజుల క్రితం ట్రాన్స్‌పోర్టు కార్పొరేషన్‌కు చెందిన ఓ మినీ వ్యాన్ చాకలిపేట వద్ద బీభత్సం సృష్టించింది. తర్వాత మరో వ్యాన్ అదే ప్రాంతంలో బ్రేకులు ఫెరుులై గోడను ఢీకొంది. నగర నడిబొడ్డున ఇటువంటి సంఘటనలు పునరావృతం అవుతున్నా పోలీసులు నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తున్నారని పలువురు ఆరోపిస్తున్నారు.