కొత్తగూడెం(ఖమ్మం జిల్లా): వేగంగా వెళ్తున్న రెండు బైక్‌లు ఎదురెదురుగా వచ్చి ఢీ కొనడంతో ఒక వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ సంఘటన గురువారం ఖమ్మం జిల్లా కొత్తగూడెం మండలం ఫోర్ ఇన్‌క్లేయిన్ చెక్‌పోస్ట్ దగ్గర జరిగింది. వివరాలు.. కొత్తగూడెం నుంచి రుద్రంపూర్ వెళ్తున్న బైక్‌ను కొత్తగూడెం వస్తున్న మరో బైక్ వచ్చి ఢీ కొట్టింది. ఈ ఘటనలో ఆదిలాబాద్ జిల్లా బెల్లంపల్లి మండలానికి చెందిన పవన్‌కల్యాణ్(17) అనే పాలిటెక్నిక్ విద్యార్థి అక్కడికక్కడే మృతి చెందాడు.
ఈ ప్రమాదంలో గాయపడిన మరో ఇద్దరిని కొత్తగూడెం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. కాగా, ఆస్పత్రిలో చికిత్స పొందుతూ వరంగల్‌కు చెందిన ఒక వ్యక్తి మృతి చెందాడు. ఈ ప్రమాదంలో గాయపడిన జీవన్‌కుమార్ అనే వ్యక్తి పరిస్థితి ప్రస్తుతం విషమంగానే ఉన్నట్లు సమాచారం. విషయం తెలిసిన పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పోస్ట్‌మార్టం కోసం తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
రెండు బైక్‌లు ఢీ: వ్యక్తి మృతి
Published Thu, Aug 20 2015 6:39 PM | Last Updated on Mon, Sep 17 2018 7:38 PM
Advertisement
Advertisement