
‘క్షణం, రంగస్థలం’ వంటి హిట్ చిత్రాల్లో కీలక పాత్రలు చేసిన అనసూయ ప్రధాన పాత్రలో రాజేష్ నాదెండ్ల దర్శకత్వంలో తెరకెక్కిన తాజా చిత్రం ‘కథనం’. ది గాయత్రి ఫిల్మ్స్, ది మంత్ర ఎంటర్‌టైన్మెంట్స్‌పై బి.నరేంద్రరెడ్డి, శర్మ చుక్కా నిర్మించారు. ఈ సినిమా ఆగస్టు 9న రిలీజ్ కానుంది. ‘‘అనసూయగారి కెరీర్‌లో బ్లాక్ బస్టర్ అవుతుందనే నమ్మకం ఉంది’’ అన్నారు నరేంద్ర రెడ్డి. ‘‘ఇది నా తొలి చిత్రం. ‘క్షణం, రంగస్థలం’ హిట్స్ తర్వాత ‘కథనం’తో అనసూయగారు హ్యాట్రిక్ కొట్టబోతున్నారు. ఆమె నటన ప్రేక్షకులను మెప్పిస్తుంది. నరేంద్రరెడ్డిగారు ఏ సినిమా పంపిణీ చేసినా అది హిట్. నిర్మాతగా కూడా ఆయన సక్సెస్ అవుతారనే నమ్మకం ఉంది’’ అన్నారు రాజేష్ నాదెండ్ల. ఈ చిత్రానికి సంగీతం: రోషన్ సాలూరి, కెమెరా: సతీష్ ముత్యాల, లైన్ ప్రొడ్యూసర్: ఎమ్.విజయ చౌదరి.
Comments
Please login to add a commentAdd a comment