గుట్టు రట్టు చేశాడు! | katreena kaif love story | Sakshi
Sakshi News home page

గుట్టు రట్టు చేశాడు!

Published Fri, Oct 7 2016 11:29 PM | Last Updated on Mon, Sep 4 2017 4:32 PM

గుట్టు రట్టు చేశాడు!

గుట్టు రట్టు చేశాడు!

ఎంత దాయాలని ట్రై చేసినా సెల్రబిటీల రహస్యాలు ఎలాగోలా బయటికొచ్చేస్తాయ్. డ్రైవరో, మేకప్‌మేనో, మేనేజరో, పర్సనల్ అసిస్టెంట్సో.. ఇలా ఎవరో ఒకరు సీక్రెట్స్‌ని బయటపెట్టేస్తారు. అఫ్‌కోర్స్ వాళ్ల ద్వారా కాకుండా వేరే రకంగా కూడా బయటకు వచ్చే అవకాశం ఉందనుకోండి. ఈ మధ్య కత్రినా కైఫ్ గురించి బయటికొచ్చిన రహస్యాలన్నీ మాత్రం ఆమె డ్రైవర్ నుంచే వచ్చాయట. రణబీర్ కపూర్‌తో గొడవపడినా, ఆదిత్యారాయ్ కపూర్‌తో స్నేహంగా ఉన్నా.. ఇలా ఏ విషయం అయినా దాగకుండా బయటకు రావడం కత్రినాను ఆలోచనలో పడేసిందట. ఎవరో కావాలనే విషయాలను బయటపెడుతున్నారని గ్రహించిన కత్రినా ముందుగా తన డ్రైవర్‌ని అనుమానించారట.

మీడియాకి రహస్యాలు చేరవేసి, అతగాడు డబ్బులు తీసుకుంటున్నాడని తెలిసి, కత్రినా ఖంగుతిన్నారని సమాచారం. ఆ డ్రైవర్‌ను చెడామడా తిట్టిన కత్రినా ‘ఇంకోసారి ఇలా చేస్తే ఉద్యోగం నుంచి తీసేస్తా’ అని ఆగ్రహం వ్యక్తం చేశారని భోగట్టా. డ్రైవర్ మీద మాత్రమే కాదు.. తన దగ్గర పని చేసేవాళ్లందరి మీదా కత్రినా ఓ కన్నేసి ఉంచుతున్నారట. కానీ, ఎంతసేపని కాపలా కాయగలరు? పాపం దీనివల్ల ఈ బ్యూటీకి మనశ్శాంతి లేకుండాపోతోందట. తప్పదు మేడమ్.. సెలబ్రిటీ లైఫ్ అంటే మాటలా మరి? అని సన్నిహితులు సర్ది చెబుతున్నారట.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement