మళ్లీ టైగర్‌ కాంబినేషన్‌ | Katrina Kaif And Not Priyanka Chopra To Be Seen In Salman Khans Bharat | Sakshi
Sakshi News home page

మళ్లీ టైగర్‌ కాంబినేషన్‌

Published Mon, Apr 2 2018 2:01 PM | Last Updated on Mon, Apr 2 2018 2:02 PM

Katrina Kaif And Not Priyanka Chopra To Be Seen In Salman Khans Bharat - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : బాలీవుడ్‌ కండలవీరుడు సల్మాన్‌ ఖాన్‌, కత్రినా కైఫ్‌ల జోడీ సిల్వర్‌ స్ర్కీన్‌పై హాట్‌ కాంబినేషన్‌గా మారింది. టైగర్‌ జిందా హై సక్సెస్‌తో ఈ జంట హాట్‌ పెయిర్‌గా పేరొందింది. మరోసారి వీరిద్దరూ ఆన్‌స్ర్కీన్‌ కెమిస్ర్టీని పండిస్తారనే వార్త బాలీవుడ్‌లో హల్‌చల్‌ చేస్తోంది. అలీ అబ్బాస్‌ జఫర్‌ దర్శకత్వంలో తెరకెక్కే భరత్‌లో సల్మాన్‌ ఖాన్‌ సరసన కత్రినా సందడి చేయనున్నారు. తొలుత ఈ మూవీలో గ్లోబల్‌ స్టార్‌గా పేరొందిన దేశీ హీరోయిన ప్రియాంక చోప్రాను లీడ్‌ రోల్‌లో తీసుకోవాలని భావించినా చివరికి చిత్ర యూనిట్‌ కత్రినా వైపే మొగ్గుచూపినట్టు ప్రచారం సాగుతోంది.

ఈ మూవీలో సల్మాన్‌ సరసన హీరోయిన్‌ ఎవరన్నది చిత్ర మేకర్లు ఇంతవరకూ అధికారికంగా ప్రకటించలేదు. సల్మాన్‌, కత్రినా కైఫ్‌లు జంటగా రూపొందిన పలు చిత్రాలు బాక్సాఫీస్‌ వద్ద ఘనవిజయం సాధించడంతో ఇదే మేజిక్‌ రిపీట్‌ చేయాలని చిత్ర బృందం భావిస్తున్నట్టు తెలిసింది. సల్మాన్‌ బంధువు అతుల్‌ అగ్నిహోత్రి, టి సిరీస్‌లు సంయుక్తంగా భరత్‌ను తెరకెక్కిస్తున్నాయి. త్వరలోనే సెట్స్‌ పైకి వెళ్లనున్న ఈ మూవీ టైగర్‌ జిందా హై తరహాలోనే అభిమానులను అలరిస్తుందని చెబుతున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement