కత్రినా చెయ్యి విరిగిందా?
కత్రినా చెయ్యి విరిగిందా?
Published Tue, Jan 31 2017 5:08 PM | Last Updated on Tue, Sep 5 2017 2:34 AM
మల్లీశ్వరి సినిమాతో తెలుగు ప్రేక్షకులకు కూడా బాగా దగ్గరైన హీరోయిన్.. కత్రినా కైఫ్. ఆ సినిమా తర్వాత బాలీవుడ్‌లో తారాపథానికి దూసుకెళ్లిన కత్రినా, మళ్లీ సౌత్ వైపు చూడలేదు. తాజాగా కత్రినా తన ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేసిన ఫొటో చూసి అంతా ఒక్కసారిగా ఆందోళనకు గురయ్యారు. ఒక పాత కారు ముందు కూర్చుని, తన ఎడమ చేతికి ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ కట్టు కట్టుకుని ఆ ఫొటోలో కత్రినా ఉంది. దాంతో ఆమె చెయ్యి ఏమైనా విరిగిందా, అందుకే ఇలా బ్యాండేజి వేయించుకుందా అని అనుకున్నారు. అయితే, ఈ ఫొటోలో ఉన్నది నిజమైన బ్యాండేజి కాదట. తాజాగా ఆమె నటిస్తున్న జగ్గా జాసూస్ సినిమా కోసం ఆమె ఈ నకిలీ కట్టు కట్టుకున్నారని తెలిసింది.
సూర్యాస్తమయం సమయం వచ్చినప్పుడు ఎంత ముఖ్యమైన పని ఉన్నా సరే వదిలిపెట్టాలని, ఒక్క నిమిషం కూడా వృథా చేయకుండా అలా చూస్తూ ఉండిపోవాలని ఆ ఫొటోకు క్యాప్షన్ పెట్టింది. అనురాగ్ బసు దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాలో కత్రినా చాలా కాలం తర్వాత తన మాజీ ప్రియుడు రణబీర్ కపూర్‌తో కలిసి నటిస్తోంది. ఈ సినిమా ఈ సంవత్సరం ఏప్రిల్ నెలలో విడుదల కానుంది. గత కొంత కాలంగా జగ్గా జాసూస్ సినిమాకు సంబంధించిన విశేషాలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తోంది. ప్రస్తుతం ఆమె ఈ సినిమాతో పాటు 'ఏక్ థా టైగర్' సినిమాకు సీక్వెల్‌గా వస్తున్న టైగర్ జిందగీ హై అనే మరో సినిమాలోనూ చేస్తోంది. అందులో మరో మాజీ ప్రియుడు సల్మాన్ ఖాన్‌తో కలిసి చేస్తోంది.
Advertisement
Advertisement